నా జీవితంలో అత‌నిది ప్ర‌త్యేక‌స్థానం

Parineeti Chopra says I will stand up and defend Arjun till the day I die

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓ సినిమాలో క‌లిసి న‌టించిన హీరో, హీరోయిన్ల మ‌ధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. సినిమా ప్రారంభానికి ముందు ఒక‌రికొక‌రు తెలియ‌క‌పోయినా… సినిమా ముగిసేటప్ప‌టికి స్నేహితుల‌వుతారు. కొత్త న‌టుల విష‌యంలో ఈ స్నేహం మ‌రింత ప‌టిష్టంగా ఉంటుంది. కెరీర్ తొలినాళ్ల‌ల్లో క‌లిసి న‌టించిన హీరో, హీరోయిన్లు ఎప్ప‌టికీ మంచి స్నేహితులుగా మిగిలిపోతారు. నిజానికి తెర‌పై జంట‌గా క‌నిపించి… త‌ర్వాత నిజ‌జీవితంలో ఒక్క‌ట‌యిన హీరో హీరోయిన్లు ఎక్కువ‌మంది కెరీర్ తొలిరోజుల్లో క‌లిసి న‌టించిన‌వాళ్లే. టాలీవుడ్ తాజా జంట నాగ చైత‌న్య‌, స‌మంత మొద‌లుకుని అల‌నాటి కృష్ణ‌, విజ‌య‌నిర్మల దాకా ఎంతో మంది ఇలా త‌మ కెరీర్ తొలినాళ్ల‌లో క‌లిసి న‌టించిన వారే. మొద‌ట వారు మంచి స్నేహితుల‌వుతారు. త‌ర్వాత ప్రేమలో ప‌డి… పెళ్లిపీట‌లెక్కుతారు. బాలీవుడ్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు.

Arjun Kapoor and Parineeti Chopra reunite for Sandeep Aur Pinky Farrar

తాజాగా మ‌రో బాలీవుడ్ జంట కూడా ఈ కోవ‌లోకే చేరే అవ‌కాశం కనిపిస్తోంది. వారే అర్జున్ క‌పూర్, ప‌రిణీతి చోప్రా. వారిద్ద‌రూ క‌లిసి ఇష‌క్ జాదే చిత్రంలో న‌టించారు. లేడీస్ వ‌ర్సెస్ రికీ బెహ‌ల్ చిత్రంతో బాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ప‌రిణీతి రెండో చిత్రం ఇష‌క్ జాదేలో అర్జున్ క‌పూర్ కు జోడీగా న‌టించింది. ఈ సినిమా పెద్ద హిట్ట‌వ్వ‌డంతో త‌ర్వాత కాలంలో ప‌రిణీతి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2012లో ఇష‌క్ జాదే విడుద‌ల‌వ్వ‌గా మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి మ‌రో చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సందీప్ ఔర్ పింకీ ఫ‌రార్ టైటిల్ నిర్ణ‌యించారు. మూవీ షూటింగ్ ప్రారంభం సంద‌ర్భంగా ప‌రిణీతి చోప్రా అర్జున్ క‌పూర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. అర్జున్ కు తాను తొలి స‌హ‌న‌టిన‌ని, త‌మ మ‌ధ్య మంచి అనుబంధం ఉంద‌ని తెలిపింది. అర్జున్ గురించి త‌ప్పుడు వార్త‌లొస్తున్నాయ‌ని త‌న‌కు తెలిస్తే… తాను చ‌చ్చేవ‌ర‌కు అత‌న్ని స‌మ‌ర్థిస్తూనే ఉంటాన‌ని వ్యాఖ్యానించింది. త‌న జీవితంలో అర్జున్ క‌పూర్ ది ప్ర‌త్యేక స్థానం అనడం ద్వారా కొత్త పుకార్ల‌కు తెర‌దీసింది ప‌రిణీతి.