ఆమె మరణం వాళ్ళని దగ్గర చేసింది

Sridevi daughters Very close with Arjun Kapoor and Anshula

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొన్ని దశాబ్దాలపాటు యువకుల హృదయాలలో గూడు కట్టుకున్న అందాల తార శ్రీ దేవి ఈ లోకం విడిచి వెళ్లిపోయి దాదాపు నెలన్నర కావస్తోంది. శ్రీదేవి గుండె పోటుతో మరించింది అనే వార్త బయటికి రాగానే యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయింది. ఈ నేపథ్యంలో సినీ పెద్దలంతా శ్రీదేవి మృతి పట్ల తమ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకి తీరని లోటన్నారు. కానీ నిజమయిన లోటు చిత్ర సీమకి కాదు ఆమె తన రెండు కళ్లలా భావించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన ఇద్దరు కుతుళ్ళకి.

ఎందుకంటే తండ్రి కంటే కూడా కూతుళ్ళు శ్రీదేవి దగ్గరే ఎక్కువ ఉండే వారు. పిల్లలకి ఆమె తోనే చనువు ఎక్కువ, కాని ఇప్పుడు ఒక్క సారిగా తల్లి లేని పిల్లలయ్యారు. కొద్ది సంవత్సరాల క్రితం బోనీ పెద్ద భార్య మరణించారు, ఇప్పుడు శ్రీదేవి కూడా మరణించడతో బోనీ పిల్లలు నలుగురు తల్లి లేని వాళ్ళయ్యారు. అయితే బోణీ పెద్ద భార్యకి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అనే ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి తెలిసిందే. శ్రీదేవి ఉన్న రోజుల్లో ఆమెను, ఆమె పిల్లలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు బోనీ కపూర్ మొదటి భార్య పిల్లలు. హీరో గా పాపులర్ అయిన అర్జున్ కపూర్ అయితే ఏకంగా వాళ్ల ప్రస్తావన తన దగ్గర తీసుకురావద్దన్నట్టుగా మీడియాతో మాట్లాడేవాడు.

కాని విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్ పిల్లల మధ్య అనుబంధం వెల్లివిరుస్తోందట. శ్రీదేవితో కానీ, జాన్వీ , ఖుషీ లతో కానీ అర్జున్ అంత క్లోజ్ గా ఉండేవాడు కాదు. కాని శ్రీదేవి మరణంతో వీరి మధ్య దూరం తగ్గింది. చెల్లెళ్లపై అర్జున్ కపూర్ కు జాలి, ప్రేమలు కలిగాయి. అందుకే వీళ్లు ఇప్పుడు అంతా కలిసి కట్టుగా కనిపిస్తూ ఉన్నారు. జాన్వీ, ఖుషీ కపూర్ లకు తాము అండగా నిలుస్తామని ఆ మధ్య బోనీ కపూర్ మొదటి భార్య కూతురు అన్షులా కపూర్ ఇది వరకే స్పష్టం చేసింది. ఇప్పుడు అసలు సంగతి ఏమిటంటే తాజాగా అర్జున్ కపూర్ ఇంటి వద్ద కనిపించారు జాన్వీ, ఖుషీలు. సాయంత్ర వేళ తండ్రి బోనీతో కలిసి జాన్వీ, ఖుషీలు అర్జున్ ఇంటికి వెళ్లారు. వీళ్లు సరదాగా కలిసినట్టుగా తెలుస్తోంది.