అర్జున్‌ రెడ్డి : వర్మ వర్సెస్‌ విహెచ్‌

arjun-reddy-movie-war-between-ram-gopal-varma-and-v-hanumantha-rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అర్జున్‌ రెడ్డి పోస్టర్‌ వివాదం మెల్ల మెల్లగా పెరిగిపోతుంది. ఇప్పటికే బిసి యువ సంఘం నాయకు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు దర్శకుడిని పిలిచి చర్చించడం జరిగింది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటికే అర్జున్‌ రెడ్డి ముద్దు పోస్టర్‌ను వెనక్కు తీసుకుంటాం అంటూ ప్రకటించారు. అయితే ఈ వివాదంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ మరియు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వచ్చి చేరారు. అర్జున్‌ రెడ్డి పోస్టర్‌ను చింపేసే ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ముసలి నేత అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో వర్మ ఇంకా పలు షాకింగ్‌ వ్యాఖ్యలను విహెచ్‌పై చేశాడు. 

వర్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా విహెచ్‌ స్పందించాడు. తాను మనవడి దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టుకోవడం నేర్చుకోవాలని వాడు సూచించాడు. అరె నాకు ముద్దు ఎట్ల పెట్టాలో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాలో తెలుసు. నువ్వు ఏందిరా బాయ్‌ నాకు చెప్పేది. నిన్ను హైదరాబాద్‌ రోడ్ల మీద తిరుగనిచ్చేది లేదు అంటూ సంచలన వాఖ్యలు చేశాడు. తనపై నేరుగా వ్యాఖ్యలు చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా వర్మ అంత సులభంగా వదిలి పెట్టడు. విహెచ్‌పై వర్మ ఎలా స్పందిస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వర్మ తీవ్రంగా విహెచ్‌పై స్పందించే అవకాశం ఉంది. మొత్తానికి అర్జున్‌ రెడ్డి వీరిద్దరి మద్య చిచ్చు రాజేశాడు. రేపు అర్జున్‌ రెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

విదేశాంగ మంత్రిగా ట‌బు

ఎన్టీఆర్‌తో సినిమా.. నందిని రెడ్డి గొంతెమ్మ కోర్కె

పిక్‌టాక్‌ : సితార ఎంత క్యూట్‌గా ఉందో చూడండి