పిక్‌టాక్‌ : సితార ఎంత క్యూట్‌గా ఉందో చూడండి

mahesh-babus-daughter-sitara-ghattamaneni-latest-photoslook-in-social-media

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూతురు ఇటీవల సోషల్‌ మీడియాలో సెలబ్రెటీ అయిపోయింది. చిన్న వయస్సు నుండి సితార ఫొటోలు సోషల్‌ మీడియాను ముంచెత్తడం జరిగింది. ఇప్పుడు సితార స్కూల్‌కు వెళ్లడం, స్నేహితులతో ఆడకోవడం వంటి సరదా సన్నివేశాలు సోషల్‌ మీడియాలో మహేష్‌బాబు అభిమానులను సంతోష పెడుతున్నాయి. తాజాగా సితార డ్యాన్స్‌ క్లాస్‌లో జాయిన్‌ అయ్యింది. ఆ విషయాన్ని ఇటీవలే మహేష్‌బాబు భార్య నమ్రత ట్విట్టర్‌ ద్వారా వెళ్లడి చేయడం జరిగింది. సితార అప్పుడే డాన్స్‌లో ఓనమాలు నేర్చుకోవడంలో బిజీ అయ్యింది. 

స్నేహితురాళ్లతో కలిసి సితార డాన్స్‌ను శరవేగంగా నేర్చుకుంటుంది అంటూ నమ్రత తాజాగా ఈ ఫొటోను షేర్‌ చేయడం జరిగింది. ఒక డాన్స్‌ కోసం ఇలా క్యూట్‌గా చీరలో కనిపించి సితార అందరిని ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతుంది. సితార ఏం చేసినా, ఎలా చేసినా మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ఫిదా అవుతూనే ఉంటారు. తాజాగా సితార చీర లుక్‌కు పడిపోతున్నారు. ఇంత క్యూట్‌ కూతురును కన్నందుకు మహేష్‌బాబు లక్కీ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. కూతురును ఇలా చూసి మహేష్‌బాబు కూడా మురిసి పోతూ ఉంటాడు. సితార ముందు ముందు మరెంతగా పాపులర్‌ అవుతుందో చూడాలి.

పిక్‌టాక్‌ : సితార ఎంత క్యూట్‌గా ఉందో చూడండి - Telugu Bullet

మరిన్ని వార్తలు:

వివేకం…తెలుగు బులెట్ రివ్యూ.

జక్కన్న తర్వాత సినిమా దాదాపు ఖాయం