చిరుతో 100 కోట్ల మూవీ ఉంది…!

Ashwini Dutt Heavy Budget On Chiranjeevi Movie

ఒకప్పుడు స్టార్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న అశ్వినీదత్‌ కొంత కాలం క్రితం వరుసగా వచ్చిన ఫ్లాప్స్‌ కారణంగా కనుమరుగయ్యాడు. కనిపించకుండా పోయిన నిర్మాతలు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా అరుదు. ఆ అరుదైన సంఘటన అశ్వినీదత్‌ విషయంలో జరిగింది. అశ్వినీదత్‌ ‘మహానటి’ చిత్రంతో మళ్లీ తన స్టార్‌డంను చూపించాడు. మెగా నిర్మాతగా పేరున్న అశ్వినీదత్‌ మళ్లీ మెగా ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు సిద్దం అవుతున్నాడు. వరుసగా భారీ చిత్రాలను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఈయన ప్రకటించాడు. తాజాగా ‘దేవదాస్‌’ చిత్రంను నిర్మించిన అశ్వినీదత్‌ మరో వైపు మహేష్‌ 25వ మూవీని కూడా నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

aswani-dutt-movies

‘దేవదాస్‌’ చిత్రం విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అశ్వినీదత్‌ తన భవిష్యత్తు ప్లాన్స్‌ను చెప్పుకొచ్చాడు. విజయ్‌ దేవరకొండతో రెండు చిత్రాలను నిర్మించబోతున్నట్లుగా ప్రకటించిన అశ్వినీదత్‌, ఎన్టీఆర్‌ మరియు చిరంజీవిలతో కూడా సినిమాలు చేయాల్సి ఉందని అన్నాడు. చిరంజీవి హీరోగా నాగి దర్శకత్వంలో 100 కోట్లతో ఒక చిత్రాన్ని చేయాలని ప్లాన్‌ చేస్తున్నామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే సినిమా ప్రారంభంకు సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి అశ్వినీదత్‌ రీ ఎంట్రీలో దుమ్ము రేపేస్తున్నాడు. తమ వైజయంతి బ్యానర్‌లో 100 సినిమాలు పూర్తి చేసే వరకు తాను విశ్రమించను అని, తన తర్వాత తన పిల్లలు కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారు అంటూ అశ్వినీదత్‌ పేర్కొన్నాడు.

aswani-dutt