అట్లీ అల్లు అర్జున్ మూవీ ఫిక్స్.. అనిరుధ్‌‌ ఏ మ్యూజిక్.. బన్నీ ట్వీట్..!

అట్లీ అల్లు అర్జున్ మూవీ ఫిక్స్.. అనిరుధ్‌‌ ఏ మ్యూజిక్.. బన్నీ ట్వీట్..!
Latest News

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. పుష్ప వన్ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ పుష్ప టు మూవీ తో కూడా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పైగా పుష్ప 2 మూవీ కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అట్లీ అయితే జవాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయారు. వీకెండ్ లోని అట్లీ 500 కోట్లని కొల్లగొట్టేసాడు. ఇక రెండవ వీకెండ్ వరకు ఈ మూవీ 700 కోట్లకు వెళ్తుందని అంటున్నారు. తెలుగు హీరోతోనే నెక్స్ట్ సినిమా అట్లీ చేస్తున్నాడని టాక్. అయితే అల్లు అర్జున్ తో అట్లీ మూవీ చేయబోతున్నాడని బాగా ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.

అట్లీ అల్లు అర్జున్ మూవీ ఫిక్స్.. అనిరుధ్‌‌ ఏ మ్యూజిక్.. బన్నీ ట్వీట్..!
Pushpa-2 Allu arjun

అట్లీ ఎప్పుడో అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పేసాడని సినిమాకి అల్లు అర్జున్ ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ తాజాగా చేసిన ట్వీట్ తో నిజంగా వీళ్ళ కాంబినేషన్ వస్తుందేమో అని అంతా అనుకుంటున్నారు . జవాన్ సక్సెస్ పై బన్నీ స్పందించాడు జవాన్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టీం కి కంగ్రాట్స్ షారుక్ ఖాన్ గారిని మాస్ అవతారంలో చూపించారు ఆనందంగా అనిపించింది అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

అలానే అనిరుద్ ని ప్రస్తావిస్తూ మ్యూజిక్ తో ఇండియా ని ఊపేసాడు గర్వంగా ఫీల్ అయ్యేలా చేశాడు అని బన్నీ ట్వీట్ కూడా చేశారు. బన్నీ ట్వీట్ కి అనిరుద్ రిప్లై కూడా ఇచ్చారు థాంక్యూ మై బ్రో అని పెడితే, సింపుల్ గా థాంక్స్ చెప్పడం కాదు నాకు కూడా మంచి పాటలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ లెక్కన చూసుకున్నట్లయితే బన్నీ, అట్లీ, అనిరుద్ కాంబో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది .