రష్మిక జిమ్ కష్టాలు.. కష్టమైనా నొప్పిని భరిస్తూ లెగ్ వర్కౌట్స్..

రష్మిక జిమ్ కష్టాలు.. కష్టమైనా నొప్పిని భరిస్తూ లెగ్ వర్కౌట్స్..
Latest News

పుష్ప 2 చిత్రీకరణలోనూ పాల్గొంటుంది. ఇటీవలే ఆమె సెట్ లో అడుగుపెట్టినట్లు తెలియజేస్తూ పుష్పరాజ్ విల్లాను తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో తెగ కష్టపడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది. సాధారణంగా హీరోయిన్స్ ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారన్న సంగతి మనకి తెలిసిందే. జిమ్ లో కష్టతరమైన వర్కవుట్స్ చేయడం.. డైట్ ఫాలో కావడం చేస్తూ ఉంటారు . తాజాగా రష్మిక లెగ్ వర్కౌట్ తో ఎంత కష్టపడుతుందో ఒక వీడియో చూస్తే అర్థమవుతుంది.

రష్మిక జిమ్ కష్టాలు.. కష్టమైనా నొప్పిని భరిస్తూ లెగ్ వర్కౌట్స్..
Rashmika Mandanna

పాన్ ఇండియా లెవల్లో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నది రష్మిక మందన్నా. పుష్ప మూవీ తో ఈ అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో హిందీలో వరుస సినిమా లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రష్మిక. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమా లతో నార్త్ అడియన్స్ ను అలరించిన ఈ కన్నడ బ్యూటీ.. ఇప్పుడు యానిమల్ మూవీ తో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతుంది. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా లో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.