మహిళా తహశీల్దార్‌ సజీవ దహనం చేసిన దుండగుడు

మహిళా తహశీల్దార్‌ సజీవ దహనం చేసిన దుండగుడు

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.  ఆమెను కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తొలుత తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు.ఈ ఘటనలో విజయారెడ్డి అక్కడికక్కడ మృతిచెందారు. ఆ తర్వాత దుండగుడు కూడా తనపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి ఆఫీసులోపలికి వెళ్లాడు. అరగంటపాటు చర్చించారు. అనంతరం ఒంటిపై మంటలతో విజయారెడ్డి బయటకు వచ్చారు.దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ తీవ్రగాయాలపాలై ఆమె తహశీల్దార్ కార్యాలయంలోనే మృతిచెందారు.

అయితే ఈ ఘటనకు కారణం ఎమ్మార్వో వేధింపులేనని తెలుస్తోంది. విజయారెడ్డికి మంటలు అంటించిన వ్యక్తి సురేష్ అనే రైతుగా గుర్తించారు.హత్యకు దారితీసిన కారణాలపై అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే పొలం రిజిస్ట్రేషన్ విషయంలో ఎమ్మార్వో డబ్బుల కోసం వేధించినట్లుగా సురేష్ ఆరోపిస్తున్నాడు. రిజిస్ట్రేషన్‌ చేసేందుకు లంచం అడిగినందుకే ఆమెను సజీవ దహనం చేసినట్లుగా తెలిపాడు. అనంతరం నిందితుడు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.