నాని నిరుత్సాహపర్చుతూనే ఉన్నాడు!

audience about nani bigg boss hosting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాచురల్‌ స్టార్‌ నాని బుల్లి తెరపై సందడి చేసేందుకు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముందు నుండి భావిస్తున్నట్లుగానే భారీ అంచనాల నడుమ బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయ్యింది. షో ప్రారంభం రోజు నాని పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలోనే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఇంకా చాలా రోజులు ఉంది. ఇంకా చాలా వారాల పాటు నాని వస్తాడు, అప్పటికి నాని చాలా మెరుగు పడుతాడు అంటూ అంతా భావించారు. మొదటి వారం ఎలిమినేషన్‌ పక్రియ తాజాగా జరిగింది. మొదటి రోజు కేవలం హౌస్‌ మెంబర్స్‌ను పరిచయం చేయడంతో కార్యక్రమం అంతా సాగింది. కనుక నాని ఎక్కువగా తన ప్రతిభ చూపించే అవకాశం రాలేదు. ఆ తర్వాత నుండి తప్పకుండా నాని అందరిని ఆకట్టుకునేలా, బిగ్‌బాస్‌ను అంతా మెచ్చే విధంగా హోస్టింగ్‌ చేస్తాడని విశ్లేషకులు కూడా భావించారు. కాని అలా జరగడం లేదని ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ప్రసారం అయిన శని, ఆదివారాల ఎపిసోడ్స్‌లలో నాని పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. ముఖ్యంగా శనివారం నాటి ఎపిసోడ్‌లో పలు తప్పులు దొర్లాయి. పలు సందర్బాల్లో కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించాడు. కొన్ని సందర్బాల్లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలో కూడా నానికి అర్థం కాలేదు. దాంతో మొహం అంతా కూడా తేడాగా పెట్టాడు. అలా రకరకాలుగా నాని ప్రేక్షకులను నిరాశ పర్చాడు. ఇంట్లో సభ్యులతో అప్పట్లో ఎన్టీఆర్‌ చాలా చక్కగా ఇంటరాక్ట్‌ అయ్యేవాడు. కాని ఇప్పుడు మాత్రం నాని అంతగా ఇంట్లో వారితో మాట కలపలేక పోతున్నాడు. వెనుక నుండి ప్రాంమ్టింగ్‌ను ఇస్తూ ఉన్నా కూడా నాని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాడు అంటూ సినీ వర్గాల వారు స్వయంగా అంటున్నారు. అయితే ఆదివారం కాస్త బెటర్‌ అని చెప్పుకోవచ్చు. శనివారం నాటితో పోల్చితే ఆదివారం నాటి ఎపిసోడ్‌లో నాని చాలా మెరుగ్గా వ్యవహరించాడు. ముందు ముందు నాని మరింతగా పరిణితి సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.