అనుకున్నట్లే సంజన ఔట్‌

Sanjana Anne eliminated from Bigg Boss Season 2

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కాస్త స్లోగా, నీరసంగా ప్రారంభం అయినప్పటికి మెల్ల మెల్లగా జోరు అందుకుంటుంది. తాజాగా ఆదివారం ఎలిమినేషన్‌ కార్యక్రమం జరిగింది. డే 2 నుండే మొదటి వారం ఎలిమినేషన్‌ అయ్యేది సంజన అంటూ సోషల్‌ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతూ వచ్చాయి. అంతా భావించినట్లుగానే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మొదటి ఎలిమినేటర్‌ సంజన అని తేలిపోయింది. నూతన్‌ నాయుడు మరియు సంజనలో ఎవరు బయటకు వెళ్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. సంజన కాస్త దుడుకు స్వభావం చూపించడంతో పాటు, ఎవరిని పడితే వారిని విమర్శించడంతో పాటు, తానో సెలబ్రెటీ అంటూ ఫీల్‌ అవ్వడంతో ఆమె పద్దతి ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఆమెకు ఓట్లు వేయలేదని, ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్న దీప్తి సునయనకు భారీగా ఓట్లు పడ్డట్లుగా నాని చెప్పుకొచ్చాడు.

మొదటి ఎలిమినేషన్‌ను నాని కాస్త నాటకీయంగా ప్లాన్‌ చేయాలని భావించాడు. అయితే నాని అనుకున్నంతగా ఆసక్తికరంగా, ప్లాన్‌ చేసినంత పక్కాగా ఎలిమినేషన్‌ కార్యక్రమం దక్కలేదు. ఎలిమినేషన్‌లో ఉన్న నూతన్‌ నాయుడు మరియు సంజనను ఒకరిని స్టోర్‌ రూంకు ఒకరిని కన్ఫెషన్‌ రూంకు పంపించారు. అక్కడ నుండి స్టోర్‌ రూంలో ఉన్న వారు ఎలిమినేట్‌ అయ్యారు, కన్ఫెషన్‌ రూంలో ఉన్న వారు ఉంటారు అంటూ నాని ప్రకటించాడు. అయితే అక్కడ రివర్స్‌ అయ్యింది. స్టోర్‌ రూం నుండి కన్ఫెషన్‌ రూంకు నూతన్‌ నాయుడు వచ్చాడు. సంజన ఎలిమినేషన్‌ అయ్యింది. ఇది పెద్దగా సర్‌ప్రైజింగ్‌గా ప్రేక్షకులకు అనిపించలేదు. ఇక సంజన బయటకు వచ్చిన తర్వాత కూడా తనదైన శైలిలో తేజస్విపై విరుచుకు పడటం జరిగింది. తేజస్వితో పాటు బాబు గోగినేనిపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక బిగ్‌బాస్‌ తనకు ఇచ్చిన బిగ్‌బాంబ్‌ను బాబు గోగినేనిపై సంజన వేసి వెళ్లి పోయింది.