మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిని డామినేట్‌ చేస్తున్న అఖిల్‌!

audience craze on Akhil hello movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని అఖిల్‌, కళ్యాణి ప్రియదర్శి జంటగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘హలో’. ఈ చిత్రం విడుదలకు పోటీగా నాని హీరోగా ‘ఎంసీఏ’ విడుదల కాబోతుంది. దాంతో హలోకు కష్టాలు తప్పవు అని అంతా భావిస్తున్నారు. అయితే అఖిల్‌ మెల్ల మెల్లగా పుంజుకుంటున్నాడు. ‘హలో’ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యే సమయానికి పెద్దగా అంచనాలు లేవు. ఇటీవల విడులైన టీజర్‌ మరియు ట్రైర్‌లతో పాటు పాటల విడుదల తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. నిన్న మొన్నటి వరకు ‘ఎంసీఏ’ చిత్రం కంటే తక్కువ ఆసక్తి ఉన్న హలో తాజాగా పైకి ఎగబాకింది.

ప్రస్తుతం ప్రేక్షకుల్లో ‘ఎంసీఏ’ కంటే ‘హలో’ చూడానే ఆసక్తి ఎక్కువగా ఉందని సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాని సినిమా వదిన మరిది నేపథ్యం అని చెప్పడంతో కాస్త ఆసక్తి తగ్గిందని, అలాగే హలో చిత్రం కొత్త ప్రేమ కథ అవ్వడంతో పాటు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక్క రోజు ‘ఎంసీఏ’ చిత్రం ముందు విడుదల కాబోతుంది. ఆ తర్వాత ‘హలో’ చిత్రం విడుదల కాబోతుంది. అంటే ఎంసీఏ చిత్రం కాస్త నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా అది హలోకు ప్లస్‌ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుంది అనేది తేలిపోతుంది.