అఖిల్ తో రానా పెర్ఫార్మెన్స్…

Akhil and Rana USA Tour For Hello Movie Promotion

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన ‘హలో’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ నెల 22న చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్బంగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రానికి సంగీతాన్ని అనూప్‌ రూబెన్స్‌ అందించిన విషయం తెల్సిందే. తాజాగా వైజాగ్‌లో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈచిత్రంలోని పాటలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంన్నాయి.

Akhil-and-Rana-USA-tour-for

ఈ ఆడియో కార్యక్రమంలో అఖిల్ లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ మరియు లైవ్ సాంగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు హలో మూవీకి అఖిల్ విభిన్నమైన ప్రచారం మొదలుపెట్టాడు. అమెరికాలో తెలుగు ప్రేక్షకుల కోసం ‘దగ్గుబాటి రానా’ తో కలిసి అఖిల్ లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ మరియు లైవ్ సాంగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. డిసెంబర్ 15, 16 , 17 ఈ మూడు రోజులు జరిగే ఈవెంట్స్ కి తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ‘హలో’ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, అనూప్ రూబెన్స్ మరియు డైరెక్టర్ విక్రమ్‌ కుమార్‌ హాజరుకానున్నారు.