అమెరికా చట్టసభలో ఆగస్టు 15 ను ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా తీర్మానం

August 15 as a 'National Day of Celebration' has been resolved in the US Legislature
August 15 as a 'National Day of Celebration' has been resolved in the US Legislature

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికాలో కూడా ప్రత్యేకంగా నిర్వహించుకొనేలా ఓ తీర్మానాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ తానేదార్‌ ప్రవేశపెట్టారు. అమెరికాలో ఆగస్టు 15ను ‘నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌’గా ప్రకటించాలని ఆయన తీర్మానంలో కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ సభ్యులు బడ్డీ కార్టర్‌, బ్రాడ్‌ షర్మాన్‌ సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. ఆ రోజును ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో సంబురాల దినోత్సవంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాలు పంచుకొనే భాగస్వామ్యానికి,ప్రజాస్వామ్య విలువలే బంధానికి మూలమని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ తీర్మానానికి బీజం పడినట్లు తెలిసింది. అధికార దేశ పర్యటనతో ఇరుదేశాల మధ్య విశ్వాసం, పరస్పర అవగాహన, చట్ట పాలన, మానవహక్కులను గౌరవించడం వంటి అంశాలపై అవగాహన పెరిగిందని తీర్మానంలో వెల్లడించారు. భారతీయులతో కలిసి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి తీర్మానం ఉపయోగపడుతుందని వెల్లడించారు