అమరావతి పై చేతులెత్తేసిన కేంద్రం..

Center raised its hands on Amaravati
Center raised its hands on Amaravati

అమరావతి రాజధాని విషయం కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తేల్చేసింది. రాజకీయ పార్టీగా అమరావతికే మద్దతు తెలిపింది. అమరావతి రాజధానికి పలు జాతీయ ప్రాజెక్టులను మంజూరు చేసింది. కొన్నింటికి నిధులు కూడా మంజూరు చేసింది. కానీ ఇప్పుడు అదనపు నిధులకు మాత్రం కోత విధించింది. ఇకపై ఆ స్థాయిలో నిధులు ఇవ్వలేమని తేల్చేసింది. మొత్తం 19 ప్రాజెక్టులకు గాను 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటికి 627 కోట్ల నిధులు చెల్లింపులు చేశారు. మరో ఏడు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. నిధుల మంజూరు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.అటు రాజకీయంగా అమరావతికి మద్దతు తెలుపుతూ.. నిధుల పరంగా మొండి చేయి చూపడంతో బిజెపి తీరు విమర్శల పాలవుతోంది. రైతుల నుంచి సేకరించిన భూములను విక్రయించడానికి సిద్ధపడింది. మరోవైపు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు నడుస్తోంది. ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఏమైనా చేద్దామని కేంద్రం భావిస్తున్నా.. కోర్టు కేసులు అడ్డంగా నిలుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.