హిందువులే టీటీడీ చైర్మన్ అవ్వాలి.. వైసీపీకి షాకిచ్చిన బిజెపి!

Hindus should become TTD chairman.. BJP shocked YCP!
BJP shocked YCP

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మంటగలిపేలా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా అన్ని విధాలుగా టిటిడి పై దాడులు చేస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ అన్య మతస్తులైన నాయకులు టీటీడీ చైర్మన్ కావడమే కారణమని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించడం మరిన్ని వివాదాలకు కారణమవుతోంది. ఆయన క్రిస్టియన్ మాత్రమే కాదు.. కమ్యూనిస్టు కూడా. హిందూ దేవుళ్లను అవమానించేలా ఎన్నో ప్రకటనలు చేశారు. ఇప్పుడు అదే మనిషికి టిటిడి ని అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు పెదవి విప్పకపోవడం విశేషం.

తాజాగా ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. దీనిపై విమర్శలు వచ్చిన తర్వాత 52 మంది నియామకాలను నిలిపివేసింది. టీటీడీని ప్రభుత్వం రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది.హిందూ ధర్మం అనుసరించే వాళ్ళనే నియమించాలి ‘… అంటూ పురందేశ్వరి ట్విట్ చేశారు.

అటు తెలంగాణలో బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఎన్నికల విడవిట్లో క్రిస్టియన్ గా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడి చైర్మన్ గా నియమించడం దారుణ చర్యగా అభివర్ణించారు. ఎప్పటికైనా ఏపీలోని హిందువులు మేల్కొనాలని పిలుపునిచ్చారు. మొత్తానికైతే టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం వివాదాస్పదమవుతోంది. కానీ జగన్ సర్కార్ ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ఇది విమర్శలకు కారణమవుతోంది.
హిందువులే టీటీడీ చైర్మన్ అవ్వాలి.. వైసీపీకి షాకిచ్చిన బిజెపి