ఏపీ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా బాబు ? వర్కౌట్ అవుతుందా ?

babu as ap assembly protem speaker

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోగా రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇక వచ్చే నెలలోనే కొత్త శాసనసభ కూడా కొలువుదీరబోతోంది. అలా అసెంబ్లీ సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవాలంటే వారితో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత ప్రొటెం స్పీకర్‌పై ఉంటుంది. సభలో సీనియర్‌గా ఉన్న ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ప్రకటించి ఆయనతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ప్రొటెం స్పీకర్ విషయానికొస్తే.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో సీనియర్ చంద్రబాబు ప్రొటెం స్పీకర్ అయ్యే అవకాశాలు మొండుగా ఉన్నాయి. 1978లో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన చంద్రబాబు 2019లో గెలుపు కలిపి మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంత సీనియర్ సభలో లేరు కాబట్టి చంద్రబాబే ప్రోటెం స్పీకర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఉండేందుకు అంగీకరించక పోతే తర్వాత జాబితాలో టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు, కరణం బలరాం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఉన్నారట. మరి దీనికి బాబు ఒప్పుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.