‘బ్యాడ్ బోయ్’ వీడియో సాంగ్.. ప్రభాస్ సరసన ఆడి పాడిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్

'Bad Boy' Video Video Song .. Bollywood Beauty Jacqueline opposite Prabhas

ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలో తన అభిమానులకు జాక్వెలిన్‌ను ప్రభాస్ పరిచయం చేశారు. ఈ వేడుకలో విడుదల చేసిన ‘సాహో’ మూడో పాట ‘బ్యాడ్ బోయ్’లో ప్రభాస్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆడిపాడింది. ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ స్వయంగా ఈ పాటను లాంచ్ చేశారు.

అయితే, ‘బ్యాడ్ బోయ్’ పాట వీడియోను తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ విడుదల చేసింది. పాట అందమైన అమ్మాయిలతో చాలా కలర్‌ఫుల్‌గా ఉంది.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్‌షా స్వరపరిచారు. నీతి మోహన్‌తో కలిసి ఆయనే ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు.

కాగా, ప్రభాస్‌తో కలిసి పనిచేయడం గురించి జాక్వెలిన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు ప్రభాస్ కష్టపడుతూనే ఉంటారు. ఆయనతో పనిచేయడం చాలా సరదాగా, క్రేజీగా అనిపించింది. ఈ పాటలో యాక్షన్ ఎక్కువగా ఉంది.

నాకు కిక్స్, పంచెస్ అంటే ఇష్టం. కానీ, ఈ పాటలోని యాక్షన్ సీక్వెన్స్‌లో నేను భాగం కాలేదు. తెలుగు లైన్స్ నాకు అర్థం కావు. వాటిని నేను పలకలేను. అలాంటప్పుడు ఈ పాట ఎలా చేయగలను అని నేను భయపడ్డాను. కానీ, ఫస్ట్ టేక్‌లోనే నేను నా తెలుగు లైన్స్‌ను స్పష్టంగా పలికాను. నేనే చేశానా అన్నంత ఆశ్చర్యపడ్డాను’’ అని వెల్లడించారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.