బాలయ్య 102కు పవర్‌ ఫుల్‌ టైటిల్‌..!

Balakrishna and Nayantara film titled as Karna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. సక్సెస్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బాలయ్య సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పటికే బాలయ్య నటించిన రెండు సినిమాలు వచ్చాయి. అందులో గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్‌ అవ్వగా, పైసా వసూల్‌ అంతగా పైసలను రాబట్టలేక పోయింది. అయినా కూడా బాలయ్య దూకుడు మీదే ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య 102వ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య ద్విపాత్రాభినయంలో సినిమా తెరకెక్కుతుంది. సి కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఆ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాకు పలు టైటిల్స్‌ను పరిశీలించారు. దాదాపు నాలుగు అయిదు టైటిల్స్‌ నుండి చివరకు ‘కర్ణ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సి కళ్యాణ్‌ ప్రస్తుతం కర్ణ టైటిల్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్ట్రర్‌ చేయించేందుకు దరకాస్తు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. రెండు పాత్రల్లో కనించబోతున్న బాలయ్య ఖచ్చితంగా అభిమానులను అలరిస్తాడని, కొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాకు పలు అంశాలు సెంటిమెంట్‌గా కలిసి వస్తాయని కూడా నందమూరి ఫ్యాన్స్‌ సంతోషంగా ఉన్నారు.

ఇప్పటి వరకు బాలయ్య, నయనతారల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. అలాగే బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ‘సింహా’ మరియు ‘లెజెండ్‌’ చిత్రాలు సూపర్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు అయ్యాయి. అందుకే ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. త్వరలో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు. బాలయ్య బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్లుగా కర్ణ టైటిల్‌ పవర్‌ఫుల్‌గా బాగుందని సోషల్‌ మీడియాలో నందమూరి ఫ్యాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.