తేజకు సున్నింతంగా నో చెప్పిన బాలయ్య

Balakrishna comments on Mokshagna entry in NTR Biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో బాలయ్య లెక్కకు మించిన గెటప్స్‌లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చిన్నప్పటి నుండి చివరి దశ వరకు చూపించబోతున్నారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్‌గా పలువురు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి పాత్రలో నారా లోకేష్‌ తనయుడు దేవాన్ష్‌ను చూపించబోతున్నారు. ఆ తర్వాత కాస్త పెరిగి పెద్ద వాడు అయిన పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ కొడుకును చూపించబోతున్నారు. ఆ తర్వాత 20 ఏళ్ల కుర్ర ఎన్టీఆర్‌ పాత్రలో నందమూరి మోక్షజ్ఞను నటింపజేయాలని తేజ కోరుకున్నాడు.

ఎన్టీఆర్‌ చిత్రంతో మోక్షజ్ఞ పరిచయం అయితే బాగుంటుందనే అభిప్రాయంను బాలయ్య వద్ద దర్శకుడు తేజ ప్రస్థావించడం జరిగింది. ఆ సమయంలో బాలయ్య సున్నితంగా తిరష్కరించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞను ఫుల్‌లెంగ్స్‌ హీరోగా పరిచయం చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చిన్న చిన్న పాత్రలో మోక్షజ్ఞను పరిచయం చేయడం వల్ల అతడి కెరీర్‌పై దెబ్బ పడే అవకాశం ఉందని బాలయ్య భావిస్తున్నాడు. అందుకే తన కొడుకును నేరుగా ఫుల్‌లెంగ్త్‌ హీరోగా తీసుకు రావాలని బాలయ్య భావిస్తున్నాడు. ఈ సంవత్సరంలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది సినిమాను విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా మోక్షజ్ఞ కనీసం మీడియాకు కూడా కనిపించకుండా ఉంటున్నాడు. మోక్షజ్ఞ ప్రస్తుతం చాలా పెద్ద వాడు అయ్యాడని, మాస్‌ హీరోకు ఉండాల్సిన ఫీచర్స్‌ ఉన్నాయనే టాక్‌ కొందరిలో వినిపిస్తుంది.