ప్రారంభోత్సవం నాడే సూపర్‌ హిట్‌

Balakrishna Duryodhana Role In NTR Biopic Launch Gave Super Hit Talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తేజ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’ నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నాడే సగం సక్సెస్‌ అయ్యింది. ఎన్టీఆర్‌ దానవీర శూరకర్ణ చిత్రం ఎంతటి సంచన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి సూపర్‌ హిట్‌ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన చిత్రీకరణ సన్నివేశాలను ముహూర్తం షాట్‌గా బాలయ్య ఎంపిక చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎన్టీఆర్‌ ఎన్నో అద్బుతమైన పాత్రల్లో నటించాడు. దుర్యోదనుడి పాత్రకు ఎన్టీఆర్‌కు మంచి పేరు వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని దుర్యోదనుడి గెటప్‌తో బాలయ్య ప్రారంభించాడు. 

ఎన్టీఆర్‌కు దుర్యోదనుడి గెటప్‌ ఎంత అద్బుతంగా సూట్‌ అయ్యేదో, బాలయ్య దుర్యోదనుడి గెటప్‌లో అంతే అద్బుతంగా ఉన్నాడు అంటూ సినీ జనాలు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో బాలయ్య దుర్యోదనుడి గెటప్‌తో సినిమా సూపర్‌ హిట్‌ అనే టాక్‌ వస్తుంది. ఈ చిత్రం కోసం బాలయ్య దాదాపు 60 గెటప్‌లను వేయబోతున్నాడు. ఆ 60 గెటప్‌లు కూడా ఖచ్చితంగా అన్నగారిని గుర్తుకు తెచ్చే విధంగా ఉంటాయనే నమ్మకం వచ్చింది. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కి తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచడం ఖాయం అంటూ నందమూరి అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. బాలకృష్ణ తన గెటప్‌ మరియు నటనతో సినిమా స్థాయిని ఆకాశానికి తీసుకు వెళ్లగలడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందా అనేది చూడాలి.