కాస్టింగ్ కౌచ్, అమ్మాయిల‌కు తిండిపెడుతోంది… స‌రోజ్ ఖాన్ వ్యాఖ్య‌లు

Saroj Khan controversy comments on Casting Couch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాస్టింగ్ కౌచ్ కు వ్య‌తిరేకంగా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై బాలీవుడ్ సీనియ‌ర్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిభ ఉన్న ఏ అమ్మాయి అయినా త‌న‌ను తాను అమ్ముకోవాల‌నుకోదు క‌దా… అని ఆమె వ్యాఖ్యానించారు. కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో అమ్మాయిల నిర్ణ‌య‌మే కీల‌క‌మ‌ని, వేషాల కోసం మ‌నం ఒక‌రికి అమ్ముడుపోవాలా… ఒక‌రిచేతుల్లో బందీకావాలా… అని ఎవ‌రికి వారే ఆలోచించుకోవాల‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు.

సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అన్న‌ది బాబా ఆజాం కాలంనుంచి ఉన్న స‌మ‌స్య‌ని చెప్పారు. కేవ‌లం సినీ పరిశ్ర‌మ‌లోనే ఇది జ‌రుగుతుంద‌ని అన‌డం స‌రికాద‌ని, యావ‌త్ స‌మాజానికి సంబంధించిన వ్య‌వ‌హారం ఇద‌ని, ప్ర‌భుత్వ‌శాఖ‌ల్లో కూడా వేధింపుల ఉదంతాలు ఉన్నాయ‌ని ఆమె వ్యాఖ్యానించారు. సినీరంగం విష‌యానికొస్తే… అమ్మాయిల‌ను వాడుకునే మ‌గ‌వాళ్లు వారిని ఊరికే వ‌దిలేయ‌ర‌ని, ఆ ర‌కంగా కొంత‌మందికైనా తిండి దొరుకుతుంద‌ని మ‌ర్చిపోవ‌ద్ద‌ని ఆమె అన్నారు. క‌నిపించిన ప్ర‌తి ఆడ‌పిల్లపైనా చెయ్యివెయ్యాల‌ని ఎవ‌రో ఒక‌రు చూస్తూనే ఉంటార‌ని, సినీప‌రిశ్ర‌మ‌పైనే బుద‌ర‌జ‌ల్ల‌డం స‌రికాద‌ని స‌రోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు.