బాలయ్యదే పూర్తి బాధ్యతనట!

Balakrishna to Produced to NTR Biopic Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం నేడు లాంచనంగా ప్రారంభం కాబోతుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతు మీదుగా బాలకృష్ణ ఈ చిత్రాన్ని ప్రారంభోత్సవం చేయిస్తున్నాడు. తేజ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ బాధ్యత మొత్తం బాలకృష్ణ చూసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. సాయి కొర్రపాటి కేవలం పేరుకు మాత్రమే నిర్మాత అని, దాదాపు 80 శాతంకు పైగా బడ్జెట్‌ను బాలయ్య కేటాయించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

తన తండ్రి జీవిత చరిత్ర సినిమా అవ్వడంతో ఎక్కడ రాజీ పడకుండా ఉండాలని, వేరే నిర్మాతకు అప్పగిస్తే బడ్జెట్‌ విషయంలో కాస్త వెనుక ముందు ఆడే అవకాశం ఉందని, అందుకే తానే రంగంలోకి దిగాలని బాలయ్య భావించాడు. తేజ దర్శకత్వంలో దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలని బాలయ్య నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ చిత్రం కోసం భారీ ఎత్తున గ్రాఫిక్స్‌ను కూడా వాడబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రాజకీయ నేపథ్యంతో పాటు, సినిమా నేపథ్యంను కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. నందమూరి అభిమానులు అందరు మరియు తెలుగు సినీ ప్రేక్షకులు అంతా కూడా ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.