మోడీ భయానికి ఇదే సాక్ష్యం…

Shatrughan Sinha meets Mamata Banerjee modi feared

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత కేంద్రంలో ఏక పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న బలవంతుడు ప్రధాని మోడీ. అయినా 11 పార్టీలు అవిశ్వాసం అంటూ సై అంటుంటే తప్పుకుని పక్కకు పోతున్నాడు. అంత అవసరం ఏమొచ్చింది?. సభలో మెజారిటీ ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ని అడ్డం పెట్టి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డం పడేలా తెగించడానికి కారణం ఏంటి ?. నిజంగానే టీడీపీ లేదా కాంగ్రెస్ అవిశ్వాసానికి మోడీ ఎందుకు భయపడుతున్నాడు ?. ఇప్పుడు ఇవే ప్రశ్నలు దేశ ప్రజల మెదళ్ళని తొలుస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం సమయంలో అన్ని సమస్యలు దేశ ప్రజల దృష్టికి వస్తాయన్న భయంతో మోడీ చర్చకు సిద్ధంగా లేరన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే అంతకన్నా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నందునే మోడీ అవిశ్వాసానికి దూరం దూరం అంటున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ లో అంతర్గత కలహాలే ప్రధాని మోడీకి అవిశ్వాసం అంటే భయం పుట్టేలా చేస్తున్నాయట. బీజేపీ కి వున్న ఎంపీల్లో దాదాపు 100 మందికి సీనియర్ నాయకుడు అద్వానీ అంటే ప్రత్యేక అభిమానం ఉందట. మోడీ, షా ద్వయం ఆయన్ని పక్కనబెట్టిన దగ్గర నుంచి వాళ్లంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఎన్నికల్లో జయజయధ్వానాలు అందుకుంటున్న తరుణంలో మోడీకి ఎదురు వెళ్లడం తగదని మౌనంగా వుంటున్నారు. వీరిలో శత్రుఘ్న సిన్హా లాంటి ఒకరిద్దరు మాత్రమే పైకి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇటీవల త్రిపురలో అద్వానీని మోడీ అవమానించిన తీరుతో రగిలిపోతున్న వారికి టీడీపీ అవిశ్వాస తీర్మానం ఓ అస్త్రంలా కనిపించింది. వారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి లోపాయికారీగా మోడీ, షా ఎన్నో ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు అని తెలుస్తోంది. అయినా అద్వానీ గ్రూప్ చల్లబడలేదు.

Sinha's--meets-Mamata-Baner

ఈ విషయాలు ఏమీ బయటకు రాకుండా రెండు వర్గాలు మౌనం పాటిస్తున్నప్పటికీ అసలు గుట్టు ఏమిటో తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తో శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్ నేతల భేటీతో తేలిపోయింది. బీజేపీ లో ఇలాంటి పరిస్థితులు, క్రమశిక్షణారాహిత్యం ఆ పార్టీ తక్కువ స్థానాల్లో గెలిచినప్పుడు కూడా లేదు. కానీ ఇప్పుడు కనిపిస్తోంది. ఇదంతా మోడీ మీద వ్యతిరేకత ఫలితమే. ఆ బాంబు అవిశ్వాసం సందర్భముగా పేలిపోయి బీజేపీ ముక్కలు అవుతుందన్న భయంతోటే మోడీ మౌనంగా వుంటున్నారు. ఆయన భయానికి సాక్ష్యమే మమతతో సిన్హాల భేటీ.