తీవ్ర నిరాశలో ఎన్టీఆర్‌ అభిమానులు…!

Aravinda Sametha Preview

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమం ఈరోజు (అక్టోబర్‌ 2) సాయంత్రం 6గంటలకు మొదలుకాబోతుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీర్‌ బాబాయి బాలయ్య ముఖ్య అతిథిగా వస్తున్నట్టు ప్రచారం జరిగింది. ట్విట్టర్‌లో హారిక హాసినీ సంస్థ వారు బాలయ్య బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు ప్రకటించారు. కానీ మరో ఖాతా నుండి తాజాగా హారీక హాసిని సంస్థ వారు అధికారికంగా ఈరోజు సాయంత్రం 6గంటలకు కార్యక్రమం మొదలు కాబోతుందని, 8.10 కి ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు. కానీ ముఖ్య అతిథిగా బాలయ్య బాబు వస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు.

nte-balayya

యూనిట్‌ సభ్యల నుండి బాలయ్య ప్రస్తావన రాకపోవడంతో ముఖ్య అతిథిగా బాలయ్య రాబోతున్నాడు అనే వార్త ఫేక్‌ అని తేలిపోయింది. ఈ సారి బాబాయి అబ్బాయిలను ఒకే వేదికపై చూడాలనుకున్న అభిమానుల్లో నిరాశ నెలకొంది. బాబాయి, అబ్బాయిల కయిక లేదనడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. మొదటి నుండి బాలయ్య వస్తాడనుకున్న అభిమానులకు ఇది తీవ్ర లోటుకు గురి చేస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌ ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ntr-pre-release-function