‘ఎన్టీఆర్‌’లో యంగ్‌టైగర్‌…!

Jr NTR Role In NTR Biopic

క్రిష్‌ తెరకెక్కిస్తున్న సీనియర్‌ ఎన్టీఆర్‌ బయెపిక్‌ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవతోంది. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్ర షూటింగ్‌ చకాచకా పూర్తి అవుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సినీ కెరియర్‌ గురించి కీలక విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రీదేవిగా రకుల్‌, జయప్రదగా తమన్నాలు కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలక్రిష్ణ నటిస్తుండగా హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ కనిపించనున్నారు. తాతగారి సినిమాలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా కనిపించనున్నాడు అని వార్తలు వచ్చాయి.

ntr-bio-pic

‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్ర షూటింగ్‌ పూర్తి దశకు చేరుకున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ పాత్ర గురించి వార్తలు ఏమి లేవు. దాంతో ఈ చిత్రంలో యంగ్‌ ఎన్టీఆర్‌ నటించడం లేదు అనేది క్లారిటీ వచ్చింది. ఎలాగైనా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ను ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో భాగం చేయాలని భావించిన చిత్ర యూనిట్‌ ఈ చిత్రం ప్రారంభానికి ముందు సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి కొన్ని విషయాలను యంగ్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు. ఈ వాయిస్‌ ఓవర్‌ను ఎన్టీఆర్‌ చేత ఇప్పించాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. యంగ్‌ ఎన్టీఆర్‌ కనిపించకున్నా కూడా వాయిస్‌ ఓవర్‌ అయినా ఉంటే అది కచ్చితంగా ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Shankar Is Selected For Vittalacharya Role In NTR Film