అర్జున్‌పై మరో నటి లైంగిక ఆరోపణలు…!

Sruthi Hariharan For Accusing Arjun Harassments

మీ టూ ఉద్యమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు తాము ఎదుర్కొన లైంగిక దాడుల గుట్టును రట్టు చేస్తున్నారు. ఇటీవలె ప్రముఖ హీరో అర్జున్‌పై కన్నడ హీరోయిన్‌ శృతి హరిహరన్‌ లైంగిక ఆరోపణలు చేసింది. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో అర్జున్‌ అవసరం లేకున్నా తన వీపుపై చేయి వేసి, గట్టిగా హగ్‌ చేసుకున్నాడు అంటూ అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. దాంతో ఆగ్రహించిన అర్జున్‌ అభిమానులు శృతి హరిహరన్‌కు బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో నటి కూడా అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. తాజాగా ఓ టీవీ షోకు ఇంటర్య్వూ ఇచ్చిన నటి అర్జున్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయట పెట్టింది.

arjun

ఒక సినిమా షూటింగ్‌ సందర్భంలో వేరే యువతిని తన గదికి పంపమని అర్జున్‌ తనతో అన్నాడని, అది కాకుండా ఆర్టిస్టులను సప్లయి చేసే వ్యక్తికి డబ్బులు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవాడని సదరు నటి అర్జున్‌పై బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది. అర్జున్‌పై వస్తున్న ఈ ఆరోపణలు ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారాయి. మీ టూ ఉద్యమంలో ఇలానే చాలామంది సెబ్రిటీల బండారాలు బయటపడుతున్నాయి.

arjun-movies