కష్టపడ్డాం కనుక అవార్డులు వచ్చాయి

balakrishnaresponds on nandi awards controversy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో ఎక్కువ శాతం అవార్డులు ‘లెజెండ్‌’ చిత్రంకు రావడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బాలకృష్ణ జ్యూరీ సభ్యులను పక్కకు పెట్టి తానే తన సినిమాకు అవార్డులు ఇచ్చుకున్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ చేసిన ఒక్క సినిమాకు అన్ని అవార్డులు రావడం పట్ల మొదటి నుండి కూడా విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. తాజాగా బండ్ల గణేష్‌, నల్లమల్లపు బుజ్జి, ఆర్‌ నారాయణమూర్తి, బన్నీ వాసు ఇలా ఎంతో మంది ఆ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం పట్ల ప్రశ్నిస్తున్నారు. తాజగా తన సినిమాకు అన్ని అవార్డులు రావడం పట్ల వస్తున్న విమర్శలను బాలయ్య తిప్పి కొట్టే ప్రయత్నం చేశాడు.

నేడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా మీడియాతో బాలయ్య మాట్లాడాడు. ఆ సందర్బంగా నంది అవార్డుల గురించి వస్తున్న వివాదంపై మాట్లాడుతూ.. తాము కష్టపడి సినిమా చేశామని, మా సినిమా భారీ కలెక్షన్స్‌ను సాధించడంతో పాటు మూడు సంవత్సరాల పాటు ఆడినది, అలాంటి సినిమా కాబట్టి జ్యూరీ మెంబర్స్‌ మా సినిమాకు అవార్డులు ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు అంటూ బాలకృష్ణ పేర్కొన్నాడు. వివాదాలు అనేవి సహజం అని, అవార్డులు రానివారు, తమ వారికి రాలేదు అని అభిప్రాయ పడేవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కామన్‌ అని, వారి బాధను, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన అవార్డు, తన సినిమాలకు వచ్చిన అవార్డులు జన్యూన్‌గా వచ్చాయి అంటూ బాలయ్య కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు.