పరువు నిలుపుకున్న అనుష్క

Bhagamathie Overseas Collections At America
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘బాహుబలి’ చిత్రంతో వచ్చిన క్రేజ్‌తో ‘భాగమతి’ చిత్రానికి భారీగా అనుష్క వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా అనుష్క ‘భాగమతి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్కా బోర్లా పడటం జరిగింది. ఏమాత్రం కొత్తదనం లేకుండా మూస హర్రర్‌ చిత్రాలు సాగినట్లుగా ఉన్నాయి అంటూ ప్రేక్షకులు ‘భాగమతి’ చిత్రాన్ని తిపికొట్టారు. ఈ నేపథ్యంలో ‘భాగమతి’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మినిమం కలెక్షన్స్‌ను కూడా వసూళ్లు చేయలేక పోయింది. ఇక తమిళం మరియు మలయాళంలో డబ్‌ అయిన ఈ చిత్రం పరువు నిలుపుకునేలా కూడా వసూళ్లు సాధించలేక పోయింది.

ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో మాత్రం ‘భాగమతి’ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. మొదటి వారంలో అంతగా వసూళ్లు సాధించలేక పోయినా ఆ తర్వాత నుండి మంచి ఆధరణ దక్కించుకుంది. మిలియన్‌ మార్క్‌ సాధ్యం కాదని అంతా భావించిన తరుణంలో తాజాగా అమెరికాలో మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసి పరువు నిలుపుకుంది. ఓవర్సీస్‌లో ఇతర పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో పాటు, అమెరికాలో అనుష్కను అభిమానించే వారు ఎక్కువగా ఉండటంతో ‘భాగమతి’ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. సినిమాపై వచ్చిన అంచనాల దృష్టిలో ఖచ్చితంగా సినిమా రెండు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందని అనుకున్నారు. కాని మిలియన్‌ డాలర్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాలేదు.