‘భరత్‌ అనే నేను’ ప్రివ్యూ

Bharat Ane Nenu Preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంను దానయ్య నిర్మించాడు. రికార్డు స్థాయి థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. కేవలం అమెరికాలో ఏకంగా వెయ్యి స్క్రీన్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. మహేష్‌బాబు సీఎంగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే.

‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి టాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేయడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్‌లో చిత్ర యూనిట్‌ సభ్యులు బిజీగా ఉన్నారు. మహేష్‌బాబుతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే విడుదలై రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన రంగస్థలం రికార్డులను సునాయాసంగా బ్రేక్‌ చేయడం ఖాయం అని, మహేష్‌బాబు నాన్‌ బాహుబలి రికార్డులను మరోసారి తన ఖాతాలో వేసుకుంటాడనే టాక్‌ వినిపిస్తుంది. మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భరత్‌ ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్‌ను కలిగిస్తాడో చూడాలి.