రికార్డుల బ్రేక్‌కు భరత్‌ రెడీ

bharath ane nenu movie ready to release

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో మరికొన్ని గంటల్లో రంగంలోకి దూకేందుకు సిద్దం అయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు నమ్మకంగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో కలిపి ఏకంగా రెండు వేల స్క్రీన్స్‌లలో భరత్‌ అనే నేను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఓవర్సీస్‌లో ఇప్పటికే టాప్‌ 3కి చేరిపోవడం ఖాయం అయ్యింది. ఇటీవలే టాప్‌ 3లో స్థానం దక్కించుకున్న రంగస్థలంను 4వ స్థానంకు నెట్టేసి మూడవ స్థానంలో మహేష్‌ నిలువబోతున్నాడు.

మహేష్‌బాబు, కైరా అద్వానీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం అనే టాక్‌ వినిపిస్తుంది. గతంలో మహేష్‌బాబు నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో దుమ్ము దుమ్ము కలెక్షన్స్‌ను వసూళ్లు చేశాయి. మహేష్‌ ఫ్లాప్‌ సినిమాలు కూడా భారీ ఎత్తున వసూళ్లు చేస్తాయి. అందుకే నైజాం ఏరియాలో భరత్‌ అనే నేను సునాయాసంగా నాన్‌ బాహుబలి రికార్డును బ్రేక్‌ చేస్తుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఇక ఓపెనింగ్స్‌ మరియు లాంగ్‌ రన్‌లో కలెక్షన్స్‌, మొదటి వారం గ్రాస్‌ మరియు షేర్‌ ఇలా అన్నింటిలో కూడా నాన్‌ బాహుబలి రికార్డును భరత్‌ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈనెల 20న విడుదల కాబోతున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రంకు దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం హైలైట్‌ అవ్వబోతుంది.