ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న “భ్రమయుగం”

bhram-yugam-fixed-ott-release-date
bhram-yugam-fixed-ott-release-date

మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన రెండు మూవీ లు గత ఫిబ్రవరిలోనే వచ్చాయి. మరి మన టాలీవుడ్ నుంచి “యాత్ర 2” రాగ మోలీవుడ్ నుంచి తన అవైటెడ్ “భ్రమయుగం” థియేటర్స్ లోకి వచ్చేసింది . మరి దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ మూవీ ఆడియెన్స్ కు ఒక డిఫరెంట్ ట్రీట్ ను ఇవ్వగా మళయాళంలో అయితే మరో మంచి హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటిటి రిలీజ్ కు వచ్చేందుకు ఈ మూవీ సిద్ధం అయ్యింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు సోని లివ్ వారు సొంతం చేసుకోగా ఇప్పుడు అఫీషియల్ గా వారు ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దీనితో ఈ మార్చ్ 15న మళయాళం సహా తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ మూవీ రానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

bhram-yugam-fixed-ott-release-date
bhram-yugam-fixed-ott-release-date

మరి ఈ మూవీ ని ఓటిటిలో చూడాలి అనుకునేవారు అయితే మరికొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. ఇక ఈ మూవీ కి క్రిస్టో జావియర్ సంగీతం అందించగా వై నాట్ స్టూడియోస్ మరియు నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.