లీక్‌.. బిగ్‌బాస్‌ నుండి దీప్తి, గణేష్‌ ఔట్‌…..?

Big House 2 to be Eleminated Contestants Leaked

తెలుగు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ ప్రారంభం అయినప్పటి నుండి లీక్‌ల బెడద పట్టి పీడిస్తూనే ఉంది. రెండవ సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన వారు ఎవరు అనే విషయం ముందు రోజే తెలిసి పోతుంది. గత వారం నందిని ఎలిమినేట్‌ అవుతుందని, అంతుకు ముందు వారం, అంతకు ముందు వారాల్లో కూడా లీక్‌ల వల్ల ముందే సస్పెన్స్‌కు తెర పడటం జరిగింది. తాజాగా ఈ వారంలో ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన వారు బాబు గోగినేని, తనీష్‌, గణేష్‌, గీత మాధురి, శ్యామల, దీప్తిలు ఉన్నారు. ఈ ఆరుగురిలో తనీష్‌ కెప్టెన్‌ అవ్వడం వల్ల ఎలిమినేషన్‌ నుండి తప్పించుకున్నాడు. ఆ తర్వాత బాబు గోగినేని మరియు గీత మాధురిలు తమకు ఉన్న పాపులారిటీతో సేఫ్‌ జోన్‌లోకి వెళ్లి పోయారు.

Big House 2 to be Eleminated Contestants Leaked

శ్యామల ఇటీవలే వచ్చింది కనుక ఆమెకు ఓట్లు బాగానే పడ్డాయి. ఇక దీప్తి మరియు గణేష్‌లలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారు అని ముందు నుండి అనుకుంటూ వచ్చారు. అనుకున్నట్లుగానే వీరిద్దరికి మిగిలిన నలుగురితో పోల్చితే తక్కువ ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. గత వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని అంతా భావించారు. కాని ప్రేక్షకుల అంచనాలను తారు మారు చేసి ఈ వారంలో ఇద్దరిని బయటకు పంపించారు. ఆ ఇద్దరు గణేష్‌ మరియు దీప్తి అంటూ లీక్‌ అయ్యింది. ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్‌కు షూటింగ్‌ పూర్తి అవ్వడంతో అప్పుడే సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం బయటకు వచ్చేసింది. షో ప్రారంభం అయినప్పటి నుండి కూడా గణేష్‌ నామినేట్‌ అవుతూనే ఉన్నాడు. కాని ఈసారి మాత్రం ప్రేక్షకులు ఆయనకు మద్దతుగా నివలేదు. ఇక దీప్తి విషయంలో కౌశల్‌ ఆర్మీ కాస్త ఆగ్రహంతో ఉన్న కారణంగా ఆమెకు ఓట్లు దక్కలేదు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Big House 2 to be Eleminated Contestants Leaked