దీప్తిపై కౌశల్‌ ఆర్మీ రచ్చ…!

Deepthi Nallamothu Cheating Bigg Boss 2 Fake Votes

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 మరో రెండు రోజుల్లో పూర్తి కాబోతుంది. ఈ సీజన్‌కు విజేత కౌశల్‌ అంటూ అంతా కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఓటింగ్‌ సరళిని చూసుకుంటే అనూహ్యంగా దీప్తికి భారీగా ఓట్లు వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీప్తి మొదటి నాలుగు అయిదు వారాల్లోనే ఎలిమినేట్‌ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె ఫైనల్‌ వరకు చేరింది. ఫైనల్‌ ఎపిసోడ్‌లో కూడా చివరి నెంబర్‌గా ఆమె ఉంటుందని భావించారు. కాని గీత, సామ్రాట్‌, తనీష్‌ల కంటే ఎక్కువగా దీప్తి ఓట్లు సంపాదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీప్తి కి చీటింగ్‌ ఓట్లు పడుతున్నాయి అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

deepthi

కౌశల్‌ ఆర్మీ ఇప్పటికే ఈ విషయమై సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీప్తికి క్యాంపెయినింగ్‌ చేసేవారు తప్పుడు పద్దతిలో ఓట్లు వేస్తున్నట్లుగా అనిపిస్తుందని ఈ సందర్బంగా కౌశల్‌ ఆర్మీ మెంబర్స్‌ చెబుతున్నారు. కౌశల్‌ ఆర్మీ ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కౌశల్‌ విజేత అంటూ అంతా భావిస్తున్న సమయంలో ఇలాంటి ఒక షాక్‌ కౌశల్‌ ఆర్మీకి పెద్ద తలనొప్పిగా మారింది. కౌశల్‌ ఆర్మీ ప్రస్తుతం చాలా పవర్‌ ఫుల్‌గా ఉంది. ఎవరు కూడా ఆయనకు దగ్గరకు కూడా రానన్ని ఓట్లు సంపాదిస్తున్నాడు. ఇలాంటి సమయంలో దీప్తికి అనూహ్యంగా ఓట్లు వస్తుండటం ఇది ఖచ్చితంగా ఫ్రాడ్‌ జరుగుతుందని సినీ వర్గాల వారు కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

big-boss-deepthi