సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్..

big shock to australia

ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తు దక్కించుకున్న ఆస్ట్రేలియాకు పెద్ద షాక్. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పీటర్ హాండ్స్‌కాంబ్‌ను ఎంపిక చేసినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సౌతాఫ్రికాతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో సాధన చేశారు. ఆ జట్టు స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ వేసిన బంతి మార్ష్‌కు బలంగా తగలడంతో మోచేతికి ఫ్రాక్చర్ అయింది. గాయం తీవ్రత దృష్ట్యా అతని జట్టు నుంచి తప్పించారు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. బ్యాటింగ్ సాధన చేస్తుండగా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి తాకడంతో మాక్స్‌వెల్‌కు గాయమైనట్లు తెలిసింది.