ఆఖ‌రి పోరాటం.. పాక్ బ్యాటింగ్‌

pak batting

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు ఆరంభ‌మైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ష‌బ్బీర్‌, రుబెల్ స్థానంలో మ‌హ్మ‌దుల్లా, మెహిదీ హ‌స‌న్ జ‌ట్టులోకి వ‌చ్చిన‌ట్లు బంగ్లా సార‌థి మ‌ష్రాఫీ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 350 ప‌రుగులు చేసి 311 పరుగులతో, 400 ప‌రుగులు చేస్తే 316 రన్స్‌, 450 ప‌రుగులు చేస్తే 321 ర‌న్స్ తేడాతో బంగ్లాను పాక్ చిత్తుగా ఓడించాల్సి ఉంటుంది. సాంకేతికంగానే సెమీఫైనల్‌ రేసులో నిలిచిన పాకిస్థాన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో అసాధార‌ణ విజయం సాధించాల్సి ఉంటుంది. బుధవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవ‌డంతో పాక్‌ నాకౌట్‌ను నుంచి దాదాపుగా నిష్క్ర‌మించింది.