ఈనెల 14న ముంబైకి కోహ్లీసేన

indian team to mumbai on 14

లండన్: ప్రపంచకప్ సెమీఫైనల్‌తో తమ ప్రస్థానాన్ని ముగించిన భారత క్రికెట్ జట్టు ఈనెల 14న స్వదేశానికి బయల్దేరి రానుంది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో గత రెండు రోజులుగా ప్రతికూల వాతావరణం ఉండటంతో జట్టు సభ్యులు బృందాలుగా బయల్దేరిరానున్నారు. దీనికి తోడు ప్రపంచకప్ ఫైనల్ తర్వాత భారత్ వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు అన్ని విమానసంస్థల టిక్కెట్లు బుక్ కావడం ఒక కారణంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఆటగాళ్లందరూ బస చేస్తున్న హోటళ్ల నుంచి పయనమయ్యారు. అందరూ లండన్‌లో కలుసుకుంటారు. ఆదివారం ఇక్కడి నుంచి బయల్దేరి ముంబైకి చేరుకుంటారు అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.