మైక్రోసాఫ్ట్‌కు యూజర్లు భారీ షాక్

మైక్రోసాఫ్ట్‌కు యూజర్లు భారీ షాక్

మనలో ఏదైనా అంశంపై మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఏం..చేస్తాం..! సింపుల్‌గా ఒకే గూగుల్‌…అంటూ గూగుల్‌ను అని అడిగేస్తాం. మనలో చాలా మంది ఎక్కువగా గూగుల్‌ క్రోమ్‌ సెర్చ్‌ ఇంజన్‌నే వాడుతుంటాం. క్రోమ్‌కు బదులుగా మరింత సెక్యూర్డ్‌ బ్రౌజింగ్‌ కోసం ఫైర్‌ఫాక్స్‌ను ఉపయోగిస్తాం. ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సెర్చ్‌ ఇంజన్స్‌ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రముఖమైనవి…గూగుల్‌ క్రోమ్‌, మోజిలా ఫైర్‌ ఫాక్స్‌, టార్‌, బింగ్‌, యాహూ.

తాజాగా మైక్రోసాఫ్ట్‌కు యూజర్లు భారీ షాకే ఇచ్చారు. ఆయా సెర్చ్‌ ఇంజన్స్‌ అప్పడప్పుడు ఎక్కువగా సెర్చ్‌ చేసిన పదాలు ఏంటని ఆయా సెర్చ్‌ ఇంజన్స్‌ ప్రకటిస్తుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్‌ ఇంజన్‌ బింగ్‌ కూడా యూజర్లు ఎక్కువగా వెతికిన పదాలచిట్టాను విడుదలచేసింది. ఈ విషయంలో బింగ్‌కు భారీ షాకే తగిలింది. బింగ్‌ సెర్చ్‌ ఇంజన్‌ను వాడుతున్న యూజర్లు ఎక్కువగా గూగుల్‌ను సెర్చ్‌ చేసినట్లు తేలింది. దీంతో బింగ్‌ను అభివృద్ధి చేసిన మైక్రోసాఫ్ట్‌ ఒక్కసారిగా కంగుతింది.

ఇదిలా ఉండగా సెర్చ్‌ ఇంజన్‌ ఎకోసిస్టమ్‌పై గూగుల్‌పై యూఎస్‌కోర్టులో పలు దావాలు నమోదైనాయి. గూగుల్‌ పలు ఈలీగల్‌ ప్రాక్టిసెస్‌ చేసినందుకుగాను ఈయూ కోర్టు కూడా భారీ జరిమానాలను విధించింది. సెర్చ్‌ ఇంజన్‌ విషయంలో..యూజర్లు ఎక్కువగా క్రోమ్‌నే కోరుకుంటున్నారు..వారిని ఏవరు బలవంతంగా ఆయా సెర్చ్‌ ఇంజన్‌నే వాడాలనే షరతును మేము ఏవర్నీకోరడం లేదంటూ గూగుల్‌ తన వాదనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ను ఆదరిస్తున్నారని గూగుల్‌ పేర్కొంది.