బిగ్‌బాస్‌-7.. హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ వీళ్లే…!

బిగ్‌బాస్‌-7.. హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ వీళ్లే...!
Latest News

బిగ్ బాస్ సీజన్లో 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. మెుత్తం 14 కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వారెవరంటే..

బిగ్ బాస్ సీజన్లో 7 కంటెస్టెంట్స్ : బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్(Bigg Boss Telugu Season 7) ఆదివారం గ్రాండ్ గా మెుదలైంది. కింగ్ నాగార్జున గారు హోస్ట్‌గా వ్యహారించిన ఈ లాంచ్ ఈవెంట్ కు యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ మరియు నవీన్ పోలిశెట్టి ముఖ్య అతిథులుగా వచ్చారు. వీరిద్దరు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ స్టేజ్ ఎక్కారు. ముందుగా నాగార్జున బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి అక్కడి విశేషాలు పంచుకున్నారు. అనంతరం కంటెస్టెంట్‌లను ఒక్కొక్కరిగా స్టేజిపైకి పిలిచి పరిచయం కూడా చేశారు.

బిగ్‌బాస్‌-7.. హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్‌ వీళ్లే...!
Bigg Boss Season -7

ఈ సీజన్ ను చాలా డిఫరెంట్ గా ఫ్లాన్ చేసారంట మేకర్స్. ఇందులో భాగంగానే బ్రీఫ్‌కేస్‌లో రూ.20 లక్షల క్యాష్‌ పెట్టేసి .. సీజన్‌ నుంచి వెళ్లిపోవాలనుకునేవాళ్లు డబ్బు తీసుకుని వెళ్లిపోవచ్చని మెుదటి 5 కంటెస్టెంట్‌లకు ఆశ కూడా చూపించారు నాగార్జున. ఆ తర్వాత రూ.5 లక్షల చొప్పున పెంచుకుంటూ రూ.35 లక్షల వరకూ వెళ్లిపోయారు . కానీ ఎవరూ దానికి ఒప్పుకోలేదు.

1. ప్రియాంక జైన్ (సీరియల్ నటి, మౌనరాగం సీరియల్ )
2. శివాజీ (సినీ నటుడు)
3. ధామిని భట్ల (సింగర్)
4. ప్రిన్స్ యావర్ (మోడల్, సీరియల్ నటుడు)
5. శుభశ్రీ (నటి, న్యాయవాది)
6. షకీల (సీనియర్ నటి)
7. ఆట సందీప్ (డ్యాన్సర్, కొరియోగ్రాఫర్)
8. శోభా శెట్టి (సీరియల్ నటి)
9. టేస్టీ తేజ (జబర్దస్త్ యాక్టర్, యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్)
10. రతిక రోజ్ (నటి, నేను స్టూడెంట్ సార్ మూవీ ఫేమ్)
11.గౌతమ్ కృష్ణ (నటుడు, ఆకాశ వీధుల్లో ఫేమ్)
12. కిరణ్ రాథోడ్ (పలు భాషల్లో హీరోయిన్‍గా నటించింది)
13. పల్లవి ప్రశాంత్ (రైతు – యూట్యూబర్)
14. అమర్‌దీప్ చౌదరి (సీరియల్ నటుడు, జానకి కలగనలేదు ఫేమ్)