పాపం… దీప్తిని మోసం చేసిన బిగ్‌బాస్‌…!

Bigg Boss Cheating Deepthi Nallamothu

టీవీ యాంకర్‌గా ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2లోకి ఎంట్రీ ఇచ్చిన దీప్తి నల్లమోతు షో మొదటి నుండి చివరి వరకు అందరి బంధువయ్యా… గా మంచి పేరును దక్కించుకుంది. దాంతో దీప్తికి అభిమానుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఇక మొదటి నుండి విజయవాడ విజయవాడ అంటూ విజయవాడ ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసింది. ‘బిగ్‌బాస్‌’ ద్వారా మంచి రెస్పాన్స్‌ ను సొంతం చేసుకున్న దీప్తి విజేత అవడానికి మొదటి నుండి కూడా చాలా ప్రయత్నాలే చేసింది. జాగ్రత్తగా టాస్క్‌లు ఆడుతూ చివర వరకు సేఫ్‌ గేమ్‌ ఆడుతూ వచ్చింది.

big-boss-deepthi

‘బిగ్‌బాస్‌’ విజేత అవడానికి ముందు నుండే తన శక్తినంత ఉపయోగించి టాస్క్‌ల్లో పార్టిసిపేట్‌ చేసేది. అలాంటి దీప్తి గ్రాఫ్‌ రోజు రోజుకు షాకింగ్‌గా పెరిగిపోయింది. ఒకానొక సమయంలో దీప్తి విజేతగా నిలుస్తుంది అనేంతగా గ్రాఫ్‌ను సొంతం చేసుకుంది. టాఫ్‌ ఫైనల్‌ ఉన్న దీప్తి చివరకు నెం.4 ప్లేస్‌ మాత్రమే దక్కింది. తాజాగా దీప్తికి వచ్చిన ఓట్ల విషయమై చాలా చర్చ నడుస్తోంది. వాస్తవానికి దీప్తికి చాలా ఓట్లు వచ్చాయి, ఓట్లను బట్టి చూస్తే దీప్తి సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. కానీ ‘బిగ్‌బాస్‌’ నిర్వాహకులు పలు కారణాల దృష్ట్యా దీప్తికి నాలుగో స్థానం కట్టబెట్టారు. ప్రముఖ గాయిని గీతా మాధురికి దీప్తి స్థానం ఇచ్చేశారు. బహుశా గీతాకు ఉన్న క్రేజ్‌ వల్ల అలా చేశారేమో! విజేత అవడానికి మొదటి నుండి చాలా కష్ట పడిన దీప్తికి కనీసం రన్నర్‌అప్‌ ఛాన్స్‌ కూడా ఇవ్వకుండా దీప్తిని మోసం చేశారు అంటూ ఆమె అభిమానులు షో నిర్వహకులపై గుర్రుగా ఉన్నారు.

deepthi