పాపం సంపూ.. ఎంత పని జరిగింది

Bigg Boss eliminates to sapoornesh babu as captain

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షోకు ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ లభిస్తుంది. అయిదవ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ పలు షాకింగ్‌ నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ముఖ్యమైనది సంపూర్నేష్‌బాబును హౌస్‌ కెప్టెన్‌గా తొలగించడం. హౌస్‌ కెప్టెన్‌ బాధ్యతలను సంపూర్నేష్‌బాబు సరిగా నిర్వర్తించడం లేదని, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సింది పోయి తానే స్వయంగా హౌస్‌ రూల్స్‌ను అతిక్రమించాడు అనే ఉద్దేశ్యంతో సంపూను కెప్టెన్సీ నుండి తొలగిస్తున్నట్లుగా బిగ్‌బాస్‌ చెప్పుకొచ్చాడు. మరో మూడు రోజులు సంపూకు కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది. కాని సంపూ దాన్ని వినియోగించుకోలేక పోయాడు.

పగటి పూట ఇంటి సభ్యులు నిద్ర పోకుండా చూడాల్సిన బాధ్యత సంపూకు ఉంది. కాని సంపూ తానే పగటి పూటి నిద్రపోయేవాడు. దాంతో బిగ్‌బాస్‌ సంపూను కెప్టెన్‌గా తొలగించడం జరిగింది. సంపూతో పాటు పగటి పూట ఎక్కువగా నిద్ర పోతున్న వారు సమీర్‌, ధన్‌రాజ్‌, ఆదర్ష్‌లను బిగ్‌బాస్‌ శిక్షించాడు. గార్డెన్‌లోనే తెల్లవార్లు ఉండాలని చెప్పిన బిగ్‌ బాస్‌ రెండు గంటల్లోనే వారికి శిక్షను తొలగించి వెళ్లి పడుకోవాలని ఆదేశించాడు. ముందు ముందు బిగ్‌బాస్‌ ఇంకా ఎన్ని షాక్‌లు పార్టిసిపెంట్స్‌కు ఇస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు

ఫిదా … తెలుగు బులెట్ రివ్యూ

మంచు లక్ష్మి రాజకీయ విమర్శలు

చిరు151 ఆసక్తికర వార్త