‘బిగ్‌ బాస్’ సీజన్ 2 పార్టిసిపేట్స్ వీళ్ళే…

Bigg Boss Telugu Season 2 Participants List

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్ మా టీవీలో తెలుగు ‘బిగ్‌ బాస్’ సీజన్ 2 రేపట్నుంచి ప్రసారం కానుంది. ఈ షో మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ సీజన్ కి తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఇప్పుడు కొన్ని సినిమాల డేట్స్ కుదరకపోవడంతో ఆయన తప్పుకున్నాడు. దీంతో ఈ షోకు వ్యాఖ్యాతగా ఇప్పుడు నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తున్నాడు. జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్ అంటూ నాని ఇదివరకే తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ షో ప్రారంభానికి కేవలం ఒకే ఒక్క రోజు ఉన్నప్పటికీ ఇంత వరకూ పార్టిసిపేట్స్ పేర్లు మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే నెట్టింట్లో మాత్రం ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆ లిస్ట్‌లో ఉన్న కొందరు సెలబ్రిటీలు షోకు వెళ్లట్లేదని క్లారిటీ ఇవ్వగా మరికొందరు మాత్రం ఇంత వరకూ స్పందించిన దాఖలాల్లేవ్. తాజాగా ఫైనల్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫైనల్ లిస్ట్ ఇదే..!

01: హీరోయిన్ రాశి
02: యాంకర్ శ్యామల
03: దీప్తి సునయన (డబ్స్ మాష్ సెలబ్రిటీ)
04. హీరోయిన్ జూనియర్ శ్రీదేవి
05. హీరోయిన్/యాంకర్ వర్షిణి సౌందరాజన్
06. హీరోయిన్ ధన్య బాలక్రిష్ణ
07. హీరోయిన్ గజాలా
08. సింగర్ గీతా మాధురి
09. టీవీ9 యాంకర్ దీప్తి చౌదరి
1౦. హీరో ఆర్యన్ రాజేశ్ (అల్లరి నరేష్ అన్న)
11. అశ్విన్ కాకుమాను (ఓంకార్ తమ్ముడు)
12. జూనియర్ ఆర్టిస్ట్/కమెడియన్ వేణు (జబర్దస్త్ వేణు)
13. బాబు గోగినేని 
14. హీరో రాజ్ తరుణ్
15. హీరో వరుణ్ సందేశ్
16. హీరో తనీష్