కన్నా సేఫ్ గేమ్.

bjp-leader-kanna-lakshminarayana-decides-to-play-a-safe-game

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల దృష్టితో సేఫ్ గేమ్ ఆడాలని డిసైడ్ అయిపోయాడు. గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ లోను పెద్ద నాయకుడిగా చెలామణి అయిన కన్నా కి చంద్రబాబు అంటే ఎప్పుడూ పడదు. బీజేపీ లో చేరాక కూడా అదే ఆలోచనా సరళి తో వెళ్లారు. ఇటీవల కూడా ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు తనని భౌతికంగా నిర్ములించడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. ఈ ఆలోచనతో వీలైతే టీడీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టి చంద్రబాబుని మిత్రపక్షం నుంచి దూరం చేయడానికి కన్నా గట్టి ప్రయత్నాలు కూడా చేసాడు. అయితే అవేమీ ఫలించకపోవడంతో ఓ దశలో వైసీపీ లోకి వెళ్లడానికి కూడా సిద్ధపడ్డారు. అటు వైసీపీ సైతం కన్నా వస్తే కళ్ళకు అద్దుకుని మరీ పార్టీలోకి తీసుకోడానికి సిద్ధ పడింది. అయితే నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోడానికి కన్నా డిసైడ్ అయ్యారట.

నంద్యాల ఫలితం చూసాక వైసీపీ లోకి వెళ్లే ఆలోచన పక్కనబెట్టారట కన్నా. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ లోనే కొనసాగుతూ పొత్తులో భాగంగా అసెంబ్లీ టికెట్ తెచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. అంతే కాకుండా ఇన్నాళ్లు టీడీపీ పట్ల తీసుకున్న వైఖరి కూడా మార్చుకోవాలని కన్నా అనుకుంటున్నారట. ముద్రగడ ఉద్యమ నేపథ్యంలో కాపుల్ని దగ్గరకు తీసుకోడానికి గట్టి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు కూడా కన్నా విషయంలో కఠిన వైఖరి సడలించుకుంటారని కూడా ఓ వాదన వినిపిస్తోంది. అయితే ఇదంతా రాజకీయ వ్యవహారమే అయితే కచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. కానీ ఇద్దరు వ్యక్తుల ఇగో తో ముడిపడిన అంశం కావడంతో పైకి అనుకున్నంత తేలిగ్గా సంధి కుదరకపోవచ్చు. అయినా తాను అనుకున్నది జరిగినా, జరక్కపోయినా సేఫ్ గా బీజేపీ లో వుండే విషయంలో మాత్రం వేరే ఆలోచనకి తావు ఇవ్వకూడదని అనుకుంటున్నారు కన్నా. ఈ సేఫ్ గేమ్ రాజకీయంగా కన్నాకు మేలు చేస్తుందో, కీడు గా మారుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు:

సంప‌న్న నేర‌స్థుల్లో రెండో స్థానంలో దావూద్

ప్రియుడి చేతిలోనే హ‌త్య‌కు గుర‌యిన చాందినీ

షింజో అబేకు ఘ‌న‌స్వాగ‌తం