గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ వ‌ద్ద శివాజీని అడ్డుకున్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు

BJP leaders attacked actor Sivaji at Gannavaram Airport

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృష్టా జిల్లా గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ వ‌ద్ద ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత‌, సినీ న‌టుడు శివాజీకి చేదు అనుభ‌వం ఎదుర‌యింది. హైద‌రాబాద్ నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు వ‌చ్చిన శివాజీని చూసి అక్క‌డే ఉన్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న్ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. శివాజీని దుర్బాష‌లాడుతూ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. మోడీపైనే విమ‌ర్శ‌లు చేస్తావా అంటూ ఆయ‌న్ను అడ్డుకుని ముందుకు క‌ద‌ల‌నివ్వ‌లేదు.

శివాజీకి, బీజేపీ శ్రేణుల‌కు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చెల‌రేగడంతో ప‌రిస్థితిని అదుపు త‌ప్పింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు శివాజీకి ర‌క్ష‌ణ‌క‌వ‌చంగా నిలిచి… ఆయ‌న్ను కారు ఎక్కించి పంపించివేశారు. దీంతో ప‌రిస్థితి సద్దుమ‌ణిగింది. శివాజీ వ‌చ్చే స‌మ‌యానికే బీజేపీ కార్య‌క‌ర్త‌లు గ‌న్న‌వ‌రం రావడానికి కార‌ణం ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడు క‌న్నాలక్ష్మీనారాయ‌ణ ఢిల్లీ నుంచి వ‌స్తుండ‌డ‌మే. క‌న్నాకు స్వాగ‌తంచెప్పేందుకు విమానాశ్ర‌యం వద్ద‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. అదే స‌మ‌యానికి శివాజీ అక్క‌డ క‌నిపించ‌డంతో వారు ఆయ‌న‌పై త‌మ ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు.