ప్రత్యేక హోదా మీద చాలెంజ్ చేసిన జీవీఎల్…స్వీకరించిన ఎన్నారై

bjp mp challenges nri tdp for a debate

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

అమెరికాలోని న్యూజెర్సీలో ఓవర్సీస్ బీజేపీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావుకు ఏపీ ఎన్నారైల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనపై నరసింహారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు ముడి పెడుతూ ఆయన మీద అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దానితో పాటు ఏపీకి మోదీ చేసిన మేలుపై చర్చకు సిద్ధమని ఎన్నారై టీడీపీ మిత్రులకు సవాల్ విసురుతూ ఓ వీడియోను పెట్టారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాన్నారు.

తన ప్రసంగాన్ని ఎన్నారై టీడీపీ మిత్రులు రభస చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. వారడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్తున్నా కూడా వారు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్నారని మనమంతా భారతీయులమని స్వదేశానికి దూరంగా ఇక్కడ నివసిస్తున్నామని ఏవైనా సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుకోవాలి తప్పితే రభస – గలాటా చేయడం మన సంస్కృతికి సంబందించింది కాదు అని అనంరు.ఎన్నారై టీడీపీ మిత్రులు ఈ విషయం మీద చర్చ చేయడానికి సిద్దంగా ఉంటె వారడిగే ప్రతి ప్రశ్నకు హేతుబద్ధంగా సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇంకా నాలుగు రోజుల పాటు అమెరికాలో ఉంటానని ఏ ప్రాంతంలోనైనా ఏ సమయంలోనైనా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తే తనంతట తానే వచ్చి మాట్లాడతానని ఆయన అన్నారు.

చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని గొడవలు పడడం వల్ల లాభం లేదని అన్నారు. మీతో మాట్లాడడానికి మీరడిగిన ప్రసనలకి సమాదహనం చెప్పడానికి ఏపీ పట్ల నరేంద్ర మోదీ గారి ప్రత్యేక శ్రద్ద గురించి వారికి వివరించి వారి చేతనే మోడీ ప్రభుత్వాన్ని గొప్ప ప్రభుత్వం అని ఒప్పించగలనన్న నమ్మకం తనకుందని అన్నారు. వినే ఓపిక – శ్రద్ధ ఎన్నారై టీడీపీ మిత్రులకుంటే ఓఎఫ్ బీజేపీ ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. అయితే దీనికి ఎన్నారై టీడీపీ నాయకుడు ఒకరు స్పందించారు జీవీఎల్ తో మీట్ & గ్రీట్ కి కుటుంబసమేతంగా రండి అని ఆహ్వానిస్తూ కరపత్రాలు ప్రింట్ వేసి పంచింది బీజేపీ వారే అని, మీరు ఆహ్వానిస్తే వచ్చిన తర్వాత ట్రెస్‌పాసింగ్ అంటారా ? లేదంటే “Entry restricted to only BJP followers” అని పెట్టి ఉండాల్సింది ఆయన పేర్కొన్నారు. అలాగే జీవీఎల్ తో మాట్లాడాలని తమకు లేకపోయినా ఆయనే చాలెంజ్ చేసాడు కాబట్టి ఈ వారాంతంలో డాలస్ కి రమ్మని ఆహ్వానించారు వారు వచ్చే విమాన చార్జీలు, వసతి ఖర్చులు మేమే పెట్టుకుంటామని ఆయన చాలెంజ్ ని స్వీకరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దానికి సంబందించిన పూర్తి వీడియో మీకోసం.

https://www.facebook.com/KCCHEKURI/videos/10215121717383960/