బ్లఫ్ మాస్టర్ టీజర్….మోసగాళ్ళకు మోసగాడు !

ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన ‘చ‌తురంగ వేట్టై’ చిత్రానికి త‌మిళ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయి విడుదలకు సిద్దం అయ్యింది. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీగ‌ణేష్ ప‌ట్టాభి దర్శకుడు. ‘జ్యోతిల‌క్ష్మి’ చిత్ర ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు. ‘ఎక్క‌డికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక‌. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో హీరోగా పరిచయమైన సత్యదేవ్ అంతకు ముందు ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు’ ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసాడు. ఇక పోయినేడాది రానా హీరోగా నటించిన ‘ఘాజీ’లో ఇంపార్టెంట్ క్యారెక్టరే చేసాడు. తాజాగా ఆయన బ్లఫ్ మాస్టర్ సినిమా టీజర్ విడుదల అయింది. మోసాల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ మీద మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.