కోట్లు పెట్టి మరీ విమర్శలు కొనుక్కుంటున్నారు !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అత్యంత ఆర్భాటంగా అన్న క్యాంటీన్ల‌ను ఇటీవ‌లే ప్ర‌భుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎంతో మంది పేదలు మూడు పూటలా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వారందరికీ ఈ రూ. 5కే భోజ‌నం ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు. కానీ ఈ పధకం ప్రారంభించిన రెండో రోజు నుండే దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి, అవన్నీ అర్ధరహితమే వారి వాదన ప్రకారం జి.హెచ్.యం.సి. నిర్వహిస్తున్న క్యాంటీన్ లకు ఏపీలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లకు ఫుడ్ సప్లై చేసేది ఇస్కాన్ కి సంబందించిన అక్షయపాత్ర సంస్థ అయితే తెలంగాణాలో 15/- సబ్సిడీ ఆంధ్రాలో 40/- సబ్సిడీ అంటే బాబు ప్రభుత్వం నలబై రూపాయలు తినేస్తుంది అని ప్రతిపక్షాల వాదన కానీ నిజానికి తెలంగాణాలో నిర్వహిస్తున్న 5/- భోజనానికి, ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లకీ క్వాలిటీ లో తేడా లేదు. అదే అక్షయపాత్ర వారే అందిస్తున్నారు. నిజానికి ఎపి ప్రభుత్వం రోజుకు 40/- సబ్సిడీ ఇస్తున్నారు ఒక భోజనానికి కాదు, అంటే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మూడింటికి కలిపి 40/- సబ్సిడీ ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక భోజనానికి 15/- సబ్సిడీ ఇస్తుంది.

తెలంగాణ లో అల్పాహారం, రాత్రి భోజనం కల్పించటం లేదు. కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం అందిస్తుంది. ఇలా ఈ ఒక్క విషయమే కాదు మరికొన్ని విషయాల్లో కూడా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు అర్ధం లేని విమర్శలు చేసి ఇరుకున పడుతుంటే మేమేమన్నా తక్కువ తిన్నామా అని చంద్రబాబుని ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేసింది చంద్రబాబు సోషల్ మీడియా కోసం ఆరు కోట్లు ఖర్చు పెడుత్నారన్న విషయం తెల్సిందే కదా. ఇప్పుడు కోట్లు పెట్టి దరిద్రం కొనుక్కున్నట్టు ఆ సోషల్ మీడియా టీం చేసిన తప్పుకు ఇంతా కష్టపడి బాబు మాత్రం మాట పడాల్సి వస్తోంది. అదేంటంటే అన్న క్యాంటీన్ల ప్ర‌చారంలో భాగంగా భారీ హోర్డిండుగులు, పోస్ట‌ర్ల‌ను విజయవాడతో పాటు రాష్ట్రంలో చాలాచోట్ల పెట్టారు. వాటిలో ఒక ముస్లిం, భుజంపై తువ్వాలేసుకున్న మ‌రో వ్య‌క్తి క‌లిసి భోజ‌నం చేస్తున్న ఫొటో ఉంటుంది. ఈ ఫొటో చూడ్డానికి బాగానే ఉంది. ఇప్పుడీ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది బాబు మీద విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశమిస్తోంది.

ఇంత‌కీ ఆ ఫొటోలో ఉన్న లోపం ఏంటంటే ఇది అన్న క్యాంటీన్లో తీసిన ఫొటో కాదు, రాజ‌న్న క్యాంటీన్లో తీసింది. అదేంటి రాజన్న క్యాంటీన్లు ఎక్కడివి అనుకోకండి. 2017లో, మంగ‌ళ‌గిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి రాజ‌న్న పేరుతో క్యాంటీన్ ప్రారంభించారు. మంగ‌ళ‌గిరిలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం ద‌గ్గ‌ర క్యాంటీన్ అప్ప‌ట్లో ఓపెన్ చేశారు. నాలుగు రూపాయిలకే భోజ‌నం అందించారు. ఆ సంద‌ర్భంగా తీసిన ఒక ఫోటోని బాబు సోషల్ మీడియా టీం వాడేసింది. మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డిపార్ట్ మెంట్‌వారే ప్ర‌చారానికి కావాల్సిన వివ‌రాలూ, ఫొటోలూ ఐ అండ్ పీఆర్ కి ఇచ్చాయట వాటిని ముందుగా చంద్రబాబు సోషల్ మీడియా టీం సీఎం ట్విట్టర్ మొదలు అన్ని ఖాతాల నుండి పోస్ట్ చేసేసింది.

దీంతో అప్పటి నుండి ఇంతా కష్టపడినా సోషల్ మీడియా టీం చేసిన తప్పిదం వల్ల అన్న క్యాంటీన్లు అని చెప్పి, రాజ‌న్న క్యాంటీన్ లో భోజ‌నం చేసిన‌వారి ఫొటోతో టీడీపీ ప్ర‌చారం చేసుకుంటోంద‌ని ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఇలాంటి కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డం ఒకెత్తు అయితే, రాజ‌కీయంగా విమ‌ర్శ‌లుపాలు కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంపై కూడా శ్ర‌ద్ధ పెట్టాలి. లేదంటే ఇలానే విమ‌ర్శ‌లుపాలు కావాల్సి వ‌స్తుంది. ఇప్పటికయినా కోట్లు పెట్టి జీతం కోసం పనిచేసేవారు కాకుండా పార్టీ కోసం పనిచేసేవారిని తీసుకుంటే ఇలాంటి తప్పిదాలు జరగవని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.