Breaking News: చంద్రబాబు కేసులో సీఐడీకి హైకోర్టు షాక్..!

Breaking News: High Court shocks CID in Chandrababu case..!
Breaking News: High Court shocks CID in Chandrababu case..!

Breaking : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులో సీఐడీకి హై కోర్టు షాక్ తగిలింది. సీఐడీ వేసిన పిటిషన్ ను హై కోర్టు కొట్టివేసింది. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ ఇచ్చిన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. పాత షరతులను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది హైకోర్టు. దింతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది.

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. బ్లడ్, యూరిన్, ఈసీజీ, 2డి ఎకో, కాలేయం – మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్, గుండె సంబంధిత టెస్టులు చేసినట్లు సమాచారం. డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ నిపుణుల సూచనల మేరకు అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో కంటికి ఆపరేషన్ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి 50రోజులకు పైగా రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.