World cup 2023: ఇవాళ అఫ్ఘానిస్థాన్ – నెదర్లాండ్స్‌ మధ్య మరో రసవత్తర పోరు

World cup 2023: Today, another juicy fight between Afghanistan and Netherlands
World cup 2023: Today, another juicy fight between Afghanistan and Netherlands

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. నిన్న శ్రీలంక వర్సెస్ భారత్ ల మ్యాచ్ జరగగా, ఇవాళ చిన్న జట్లు అయినా ఆఫ్ఘనిస్తాన్ మరియు నెదర్లాండ్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బీహార్ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో ఈ బిగ్ ఫైట్ జరగనుంది. ఎప్పటిలాగే మధ్యాహ్నం 2 గంటల సమయంలో…ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జత మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో అంచనాలకు మించి ఆఫ్ఘనిస్తాన్ మరియు నెదర్లాండ్స్ జట్టు రాణిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద జట్లైన శ్రీలంక, పాకిస్తాన్ లాంటి వాటిని కూడా ఆఫ్ఘనిస్తాన్ మరియు నెదర్లాండ్స్ మట్టి కల్పించాయి . అలాంటి ఈ రెండు జట్ల మధ్య ఇవాళ పోరు జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు సెమీ స్ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే ఒక జట్టు కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. మొత్తానికి ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. అలాగే మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేస్తే విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.