శ్రీలీల.. రెమ్యునరేషన్ కూడా పెంచేసింది…వామ్మో..?

తమిళ్ సినిమాలో ఛాన్స్ అందుకున్న శ్రీలీల....
Cinema News

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్యూటీస్ లో రష్మిక మందన్న తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్న భామ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉంది ఈ చిన్నది. బ్యాక్ టు బ్యాక్ పెద్ద మూవీ అవకాశాలు కూడా వస్తున్నాయి . వచ్చిన ప్రతి సినిమాలోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా పేరు గాంచింది . మూవీ అవకాశాలు పెరుగుతుండడంతో శ్రీలీల తన పారితోషికాన్ని కూడా పెంచేసింది .

శ్రీలీల తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచుకుందని టాక్ వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభించినప్పుడు కన్నడ మూవీ ల్లో లక్షల్లో పారితోషికం తీసుకున్న శ్రీలీల.. తెలుగులోకి అడుగుపెట్టిన తర్వాత కూడా మొదట్లో లక్షల్లోనే పారితోషికం తీసుకున్నది . అయితే రీసెంట్ గా శ్రీలీలకి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో రెమ్యునరేషన్ కూడా పెంచింది . శ్రీలీల ఇప్పుడు ఒక్కో సినిమాకి రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది.

శ్రీలీల.. రెమ్యునరేషన్ కూడా పెంచేసింది...వామ్మో..? - Telugu Bullet

శ్రీలీల రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ మూవీ లో నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాలో నందమూరి బాలకృష్ణకు పోటీగా శ్రీలీల నటించి మెప్పించింది. తన నటన, డ్యాన్స్‌ తో ప్రేక్షకులను మెప్పించింది. శ్రీలీల అందం, అభినయం ముఖ్యంగా డ్యాన్స్‌ ప్రేక్షకు లను ఫిదా చేసింది.

తెలుగులో అత్యంత బిజీ యంగ్ నటి శ్రీలీల దూసుకుపోతోంది. తెలుగులో శ్రీలీల నటించిన ‘స్కంద’ సినిమా ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ మూవీ విడుదలై సూపర్ హిట్ అయింది. శ్రీలీల ప్రస్తుతం ఐదు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా చేస్తుంది . శ్రీలీల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, ‘ఆదికేశవ’ సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త మూవీ కు కూడా శ్రీలీలనే హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో శ్రీలీల ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే శ్రీలీలకి తమిళ మూవీ ల ఆఫర్లు కూడా వస్తున్నాయి, శ్రీలీల ఒక్క తమిళ సినిమాకు ఓకే చేసిందని టాక్ వినిపిస్తోంది. శ్రీలీల ఒక స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ కూడా రానుంది.