నేనొక నెంబర్ వన్ సెఫాలజిస్ట్…!

Buddha Veena's illegal assets worth Rs 100 crore

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న అక్రమాస్తుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జీవీఎల్ కు వందల కోట్ల ఆస్తులున్నాయని, ఆయన అవినీతి బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. జీవీఎల్ పెద్ద పవర్ బ్రోకర్ అని జీవీఎల్ ఆస్తులు ఏ రూపంలో ఉన్నాయో చెబుతామని, తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే ఏపీ వదిలి వెళ్లిపోతానని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.

Buddha Veena's illegal assets worth Rs 100 crore
అయితే బుద్దా వెంకన్న చేసిన ఆరోపణలపై జీవీఎల్ స్పందించారు. తన వద్ద వంద కోట్ల ఆస్తి ఉంటే, బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఆ ఆస్తులు తనవి కాదని తేలితే అంతే విలువ చేసే ఆస్తులను టీడీపీ తనకు కొనిపెడుతుందా? అని జీవీఎల్ ప్రశ్నించారు. తనకు చెక్కు రాసిస్తే, అందులో రూ.10 కోట్లు ఏపీ జర్నలిస్టుల కోసం ఇస్తానని వ్యంగ్యాస్తాలు సంధించారు. తనకు ఉన్న ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నానని, 1993లో కొన్న ఆస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.28 కోట్లు అని, తాను నెంబర్ వన్ సెఫాలజిస్ట్ ను అని చెబుతూ, తన సొంత సెఫాలజీ సంస్థ ‘డీఆర్ఎస్’ను 1997లో ప్రారంభించానని జీవీఎల్ ప్రకటించారు.

Buddha Veena's illegal assets worth Rs 100 crore